"అయామ్ సారీ , వి డిడ్ ఆల్ ది బెస్ట్ వి కెన్. బట్..."
డాక్టర్ల మాట విన్నాక అతనికి ఏమీ తోచట్లేదు. అంతాపోయింది. అయిపోయింది.
తను ఇక ఉండదు.
" తను మాట్లాడలేదు. బట్..వి థింక్ , మే బీ, నువ్వేమైనా చెబితే తనకు వినబడొచ్చు. అర్థం కావొచ్చు కూడా. వి ఆర్ నాట్ ష్యూర్. ఏమో! మీరేమైనా చెప్పాలి అనుకుంటే... " ఎంతో పరిణితి చెందిన వైద్యశాస్త్రం అంతాచేతులెత్తేసి నాకిస్తున్న బంపర్ ఆఫర్ అదీ.
ఏ నిముషం అయినా తన ఊపిరి ఆగిపోవచ్చు. ఆ గుండె.
"లబ్‌డబ్, లబ్‌డబ్.." ఇప్పుడే అప్పుడే ఆగిపోవచ్చు
"హే నీ హార్ట్ బీట్ భలే వినిపిస్తోంది"
"ఛా..అలా డైరెక్ట్‌గా బ్రెస్ట్ మీద పడుకుంటే వినపడదేంటి..లేవరా బరువు"
"నే లేవను..కదలకు..కొరికేస్తా"
"ఒద్దురా..ప్లీజ్. ఇప్పటికే మంట. నిన్న నీ కొరుకుడు మంటకు ఆఫీస్‌లో ఎంత ఇబ్బంది అయ్యిందో తెలుసా"
"ఏం ఇబ్బంది ?"
"నీకేం తెలుసురా మోటువెధవా. కాన్ఫరెన్స్ మధ్యలో లేచి బ్రా తీసేయ్యాలి అన్నంత నొప్పి పుడుతుంది "
అదేమిటో.. అంత సెక్సువల్ మెమరీ వచ్చింది మొదట. అంతేనా ఆమె నాకు. ఆ మెత్తటి గుండెలు. నన్ను దాచుకున్నవి.
"డాడీ.." ఇంకా విషయం అర్థం కాని అమ్మాయ్ భయంగా అడుగుతోంది. ఈ పిల్లను ఎవరు చూసుకుంటారు ?
"బెటర్ బీ క్విక్ సర్ " తెల్లటి మృత్యుదేవతలాంటి డాక్టర్ భుజం తట్టాడు.
అమ్మాయిని బంధువులకు అప్పజెప్పి, ఐసీయూ గదిలోకి అడుగుపెట్టాను.
అంతా ఒకటే వాసన. చావు వాసన.
అదిగో ఆ మంచంలో..ఆమె శరీరం.
ఎంత పని చేసాడు , ఆ తీవ్రవాది ? లంజకొడుకు. మా ఫ్యామిలీ , నేను , తను..మాకేం సంబంధం..పాకిస్తానుకో, త్ తాలిబానుకో, అమెరికాతో ఆయిల్ వ్యాపారానికో. మాకేంట్రా సంబంధం ?
"యాక్..పింక్ డ్రస్సులు ఇష్టమా నీకు ?"
"అవునూ..తప్పేంటి , అమ్మాయిని కదా"
"అమ్మాయ్ అయితే పింక్ నచ్చాలా ?"
"సెక్స్ ఛేంజ్ చెయ్యిచ్చుకో , నీకప్పడు అర్థమౌతుంది"
"నేను అలా అయిపోతే..మరి.. నీ పరిస్థితి ? " పింక్ చీరను లాగేస్తూ హత్తుకున్న ఙ్ఞాపకంలో ఛాతీకు ఆమె ఎద తగిలినట్లే అనిపించింది.
"నాకేం తేడా రాదు. నువ్వు అమ్మాయివి ఐతే నేను అప్పుడు లెస్బియన్ అయిపోతే"
"అబ్బో..భలే మాటలు నేర్చావ్ " కొరికాను. మెత్తటి చోట. అరిచింది. ఇప్పుడు ఆమె గొంతు పెగలదట.
ఏం చెప్పాలి ? ఏం చెప్పాలి ?
ఇంకాసేపట్లో చచ్చిపోయే తనకు ఏమని చెప్పాలి?
నువ్వు లేకపోతే నేను ఉండలేను , అనేది అబద్ధం. ఉంటాను. ఉండాలి. అమ్మాయ్ ఉంది. ఇంకా చాలా లైఫ్ ఉంది. అది ఎంత దుర్భరమైనదైనా జీవితమే. ఉట్తిమాటలూ ప్రగల్భాలూ ఒద్దు .నిజం చెప్పాలి. అమ్మాయ్ని గొప్పదాన్ని చేస్తాననా? అదెలాగూ జరిగేదీ తనకు తెలిసినదే కదా. మళ్ళీ మరే ఆడదాన్నీ ప్రేమించననా? అది నిజమా ? ఏమో..భవిష్యత్తు ఎవరికి తెలుసు. ఆమె గుండెచప్పుడును తెలియజేస్తున్న..అదేదో మిషను.. తన్నుకు ఛస్తోంది. అది ఎప్పుడైనా ఆగిపోవచ్చు. చెప్పు. చెప్పు. త్వరగా ఏదో చెప్పు.
రేకులన్నీ ఊడిపోయిన గులాబీ పువ్వులా , కరిగిపోతున్న స్ట్రాబెర్రీ ఐస్‌క్రీమ్‌లా , వడలిపోతున్న బెలూన్లా...పీలబడిపోతున్న పింక్‌గా తను. నాకు ఏడుపు.
ఒక్కటే చెప్పగలను.
మెల్లగా ముఖాన్ని సమీపించాను.కళ్ళు మూసుకున్నాను.
" మొదటి ముద్దు ఎక్కడయితే బావుంటుంది?"
"ఎక్కడేమిటీ.. లిప్స్ మీదే. ఫ్రెంచ్ టైప్?"
"ఒరే కామపిశాచీ, నేనడిగింది అది కాదు. ఏ లొకేషన్లో మనం ఫస్ట్ కిస్ పెట్టుకుందాం అని. జీవితాంతం ఆ ట్రిప్ , ప్లేసూ గుర్తుండిపోవాలి కదా?"
"హనీమూన్ ఎక్కడ పెట్టుకున్నా, ఆ..విషయాలన్నీ హోటల్ రూంలోనే కదా"
"టేస్ట్ లేదురా నీకు"
"మరి ఎక్కడ చేద్దాం?"
"గుడిలో.."
"వాట్ ?"
"హ్మ్మ్.. ఇదేదో పాపంలా ఎందుకు? గర్భగుడి ఎదురుగా..దేవుడు చూస్తుండగా?"
"పిచ్చా నీకు?"
"ఎవ్వరూ లేని టైంలో ఎర్లీ మార్నింగ్ వెళదాం. అర్చనకు డబ్బులిచ్చాక పూజారి మనమొహం కూడా చదవడు. తను మన పేర్లతో మంత్రాలు చదువుతుండగా..ఆ కర్పూరపు సువాసనల్లో.."
"నీకు పైత్యం ఎక్కువే తల్లీ. దొరికాం అంటే పిచ్చకొట్టుడు కొడ్తారు. అయినా తప్పు. అపచారం"
" అయితే కుదరదా? "
కుదరలేదు.
చెవి దగ్గరకు వెళ్ళాను.
"దేవుడు ఇప్పుడు చూస్తుండడూ ? ఇక్కడే ఎక్కడో.."
నా పెదవులు అమె చెవి మీదే అద్దుకున్నాయి.
చప్పుడు ఆగిపోయింది, మిషనులో.
కానీ నాకు వినిపిస్తోందే:
"వొద్దురా..చక్కలిగిలిగా ఉంది" నవ్వుతూ తను.

5 comments:
బాగున్నట్లే వుంది విప్లవ్.. :-) టైపోస్ వున్నాయి. చూడండి.
viplove mimmalni okati adagochcha
anavasaram anukunte samadhanam cheppakandi...
meeru chala ekkuvaga preminchina vaallani epudainaa dooram chesukunnaraa...
sorry ila aduguthunnanduku
mee novel manasa sancharare chadivinappati nundi naku enduko ala anipinchindi, aa badha anubhavichinatlugaa rasaru..
@anonymous
adi bhayam kaavochchu ga :)
Hi Viplove i like the novel manasa sancharare..where i get that...can you please inform to me..
Anonymous
I havent printed it , yet
too big in volume counting some 500pages, i thought of editing atleast 150 out of it...will do it when i have 2-3months time for it
thank you
Post a Comment