సినిమా ఇలా తియ్యాలి, అలా తియ్యాలి . ఈ సీను అలా తీసుండాల్సింది. నేనైతే ఇలా తీస్తాను.
మనందరం అనే మాటలూ , వినే మాటలే ఇవి. కానీ అసలు సినిమా "తీయడం" అంటే ఏమిటి? కాన్సెప్టు నుండి తెర మీది చిత్రం వరకూ సాగే ప్రస్థానంలో ఒక అతి ముఖ్య ఘట్టం : షూటింగ్.
కథ వ్రాసుకోవడం , సంభాషణలూ , స్క్రీన్ ప్లే సమకూర్చుకోవడం ,బడ్జెట్ చూసుకుని, నటీనటులు, లొకేషన్ల ఎంపిక అన్నీ అయ్యాక మొదలవుతుంది ఈ ప్రక్రియ. సినిమా మీది ప్రేమ కలిగిన ప్రతివాడూ చూడాలి అనుకునేది ఈ షూటింగే. అసలు సినిమా ఎలా తీస్తారు అనే ప్రశ్నతో మొదలయ్యి , ఓహో తెర్ మీద మనకు కనిపించే సన్నివేశం జరగడానికి ఇంతమంది రకరకాలుగా కష్టపడతారా అని తెలుసుకున్నాకే సినిమా మీద ప్రేమతో పాటు గౌరవం కలుగుతుంది. షూటింగును ప్రేమించిని వారు సినిమా దర్శకులు కాలేరు.
చిన్నప్పుడు ఆల్ఫ్రెడ్ హిచ్‍కాక్ ఇంటర్వ్యూలు చదిచితే ఆయన మాట ఒకటే పదేపదే ఎదురుపడేది " సినిమా అంతా అయిపోయింది ఇక షూటింగే మిగిలింది " అనడం. ఎందుకో ఆ వాక్యాలు చాలా ప్రభావితం చేసాయి. నేను దర్శకుడిని అయితే ఖచ్చితంగా అంత పకడ్బందీగా తీయగలిగినప్పుడే సినిమా తీయాలి అనిపించేంది.
కానీ....
కానీ...
కానీ.....
డ్రమాటిక్‍గా చెబుదామని అన్ని "కానీ"లు చెప్పా...అనుభవిస్తేనే తెలుస్తుంది ఆ కష్టం ఏమిటో. చిన్న షార్టు ఫిలిమ్స్ తీసేటప్పుడే , అదీ నాన్ కమర్షియల్ ప్రాజెక్టులు , అదీ నాలాగే సినిమామీది ప్రేమతో వచ్చిన తోటి ఫిలిం స్టూడెంట్లతో తీస్తున్నప్పుడే వంద సమస్యలు . నాకే కాదు, అందరి పరిస్థితులూ అంటే. అతి చిన్న చిన్న విషయాల్లో చిన్నపాటి మతిమరుపు / అలక్ష్యం / నిర్లక్ష్యం ఖరీదు చాలా పెద్దదే. ముగ్గరు మనుష్యులు కలిస్తే ఎవరి మాట నెగ్గాలి అనే పంతం పుడుతుంది. బ్లాగుల్లో అయినా ఒక వ్యక్తి ఒకటి రైటు అంటే ఇంకోడు కాదు అంటాడు. ఇక ఒకే విషయాన్ని ప్రేమించే వాళ్ళు పదిమంది చేరి ఆ ప్రేమకోసమే తపించే ప్రయత్నంలో పక్కవాడి ప్రేమకంటే నా ప్రేమ ఎక్కువనే భావంలో అనేక తగాదాలు.
ఒక చిన్న ఉదాహరణ :
స్క్రిప్టులో ఇలా ఉంది తీసుకుందాం : రాముడు చేతిలో వంగిన ధనుస్సు పెళపెళమంటూ విరగగానే ,చేమంతిపూలవర్షం కురిసింది. సభలోని రాజులందరూ హర్షధ్వానాలు చేసారు. సీత ముఖం సంతోషంతో , సిగ్గుతో వెలిగిపోయింది. దశరధుడి ఒళ్ళు పులకించింది.
ఇక్కడ ఏ డైలాగూ లేదు. ఇంత సులభంగా కనిపించే ఈ సన్నివేశం తెరకెక్కించాలి అనుకుంటే, ఇక్కడ ప్రధాన పాత్రధారులు కేవలం ముగ్గరే. తక్కినవారంతా "ఎక్స్‌ట్రాలు "
సెట్టింగును ఆర్టు డైరెక్టరు చూసుకున్నాడు. మనం ఈ సన్నివేశాన్ని కేవలం మూడే షాట్లుగా విభజించుకున్నాం. మొదటి రెండు వాక్యాలూ లాంగ్ షాటు, టాప్ ఏంగిల్. రెండవ వాక్యమూ, మూడవదీ టైట్ క్లోజప్పులు. నాకు తెలిసి ఈ సన్నివేశాన్ని ఇంతకంటే సులభంగా తీయలేము. (అస్సలు ఎఫెక్టు లేకుండా ఉండాలంటే దశరధుడినీ , సీతనూ కూడా ఎక్స్‌ట్రాల్లో కలిపేసి ఒకే షాటు లాగించెయ్యిచ్చు...కానీ అప్పుడు స్క్రిప్టు అన్యాయం అయిపోతుంది )
ఇక్కడ షూటింగులో ఉంటాయి కష్టాలు. దశరధుడికి కిరీటం సరిగా సరిపోదు. దాన్ని ఎంత సరిచేసినా కుదరదు. సరే అప్పుడు రాజీ పడి , రాముడి కిరీటం అతనికి మారుస్తాం. ప్రాక్టీసులో ధనుసు ఎలా విరగాలో పదిసార్లు చేస్తే, తీరా షాటులో అది విరగదు. అందుకని రీ టేకులు వెళ్తుంటే , రాముడి పాత్రధారికి చంకల్లో చెమట పోసీ పోసీ చిరాకు వచ్చి "ఎన్నిసార్లు విరచాలి" అంటాడు. అతడిని బుజ్జగించి షాటుకు సిద్ధపడితే , విల్లు విరుగుతుంది , చేమంతులు పడ్తాయి, ఎక్స్‌ట్రాలు చప్పట్లు ఆలస్యంగా కొడతారు. మళ్ళీ రీ టేకు . ఈ సారి పువ్వుల్లో ఒకటి రాముడి ముక్కుకు తగిలి అతను షాటులో గాఠ్ఠిగా తుమ్మేస్తాడు. ఇంకో టేకు, అంతా సవ్యంగా జరిగినా దర్శకుడికి ఎందుకో ఏదో టైమింగు మిస్ అయినట్లు అనిపిస్తుంది. రాముడు విల్లు విరిచినప్పుడు ముఖంలో విసుగు కనిపిస్తున్నట్లు, చప్పట్లు కొట్టే ఎక్స్‌ట్రాల ముఖాల్లో ఆకలి గోచరిస్తుంది. సో లంచ్ బ్రేక్.
భోజనం బ్రేకు అరగంట అనుకున్నది , గంట అవుతుంది. ఈ లోగా సినిమాటోగ్రాఫర్‍కు విరోచనాలు. తట్టుకుని నిలబడతాడు. టేకుకు వెళితే , అంతా సవ్యంగా జరుగుతున్న సందర్భంలో కెమెరాలో ఫిలిం ఫుటేజ్ సగంలో అయిపోతుంది. క్యాన్ మార్చాలి కాబట్టి , షాటు కట్. ఈసారి టేకులో , విల్లు లాగిన కుదుపుకు రాముడు తూలిపడతాడు. అసహ్యంగా ఉంది రీటేక్. కుమ్మరించడానికి పువ్వులు అయిపోయాయి అని అసిస్టెంటు బిక్కముఖం వేస్తాడు. అర్జెంటుగా వెళ్ళి పట్టుకురమ్మని పంపుతారు. ఈలోగా సమయం వృధా ఎందుకని క్లోజప్ షాటులకు దిగితే ,
ఇంతసేపూ ఖాళీగా ఉన్న సమయంలో సీత పాత్రధారి ఫోన్‍లో తన ప్రియుడితో మెసేజ్ ఛాటింగ్ చేసింది, వాళ్ళా మధ్య గొడవ అయింది. ఇప్పుడు సిగ్గు , సంతోషం వెలిబుచ్చడం ఆమెకు చేతనవ్వట్లేదు. నాలుగు టేకులు తిన్నాక అనుకున్న అభినయం రాకపోవడంతో విసిగి, మూడ్‍లోకి రావడానికి ఒక అరగంట టైం అడిగింది. ఆ అమ్మాయి మంచి నటే. ఇలాంటి స్థితిలో ఒక్కతే మేకప్ రూంలో దూరి అద్దం ముందు ప్రాక్టీసు చేసుకుని తర్వాత అద్భుతంగా చేస్తుంది. సరే అని ఆ అమ్మాయికి ఆవకాశం ఇచ్చి దశరధుడి క్లోజప్‍కు వెళితే , ముందు అనుకున్న కిరీటం కాక వేరేది పెట్టడంతో ఆ కిరీటం క్లోజప్ ఫ్రేమింగులో ఇమడడం లేదు. లెన్సు మారిస్తే మిడ్ క్లోజప్ అవుతోంది. సరే విసిగిన దర్శకుడు రాజీ పడి అలాగే షాటు లాగించేస్తాడు. పువ్వులకోసం వెళ్ళిన అసిస్టెంటు ఫోన్ చేస్తాడు , తెలుగుదేశం పార్టీ నేత ఏదో ఊరేగింపు కనుక చామంతులు అన్నీ మార్కెట్‍లో అయిపోయాయి, ఏ పువ్వులు తేవాలి అని ? దర్శకుడికి ఉక్రోషం నీరసం వస్తాయి. సెట్‍లో మిగతా రంగుల మధ్య చామంతులు అయితేనే బావుంటాయని కదా అవి ఎన్నుకుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి ? మల్లెలు వేద్దాం అంటాడు. సినిమాటోగ్రాఫర్ ఒప్పుకోడు. లైట్ల వెలుగు తెల్లటి మల్లెలు అసలు కంటికి తెలియవు , మల్లెల ఎక్స్‌పోజర్ సరిపోయేట్లు లైటింగ్ మార్చాలి అంటే ఇంకో అరగంట సేపు చాలా మార్పులు చెయ్యాలి అంటాడు. కాల్షీట్ల టైం ఎక్కువలేదు కాబట్టి అలా ఒద్దు అనుకుంటే , ఏ గులాబీలతోనో కనకాంబరాలతోనే లాగించొచ్చు అంటాడు. ఆ రంగు రావడం దర్శకుడికి ఇష్టం లేదు. అప్పుడు హీరో సలహా ఇస్తాడు. హీరోయిన్ సలహా ఇస్తుంది. అసిస్టెంట్లు సలహాలు ఇస్తారు . దశరధుడూ సలహా ఇస్తాడు. వీళ్ళందరి సలహా నేను వినడం ఏంటని, ఇంతకుముంద్ నేలరాల్చిన పూలనే మళ్ళీ పోయమంటాడు దర్శకుడు, కనీసం అలా అయినా రాజీ పడకుండా షాటు తీయొచ్చు అని. దుమ్ములో పడిన పూలా అని హీరోకు కోపం వస్తుంది. అతడిని బుజ్జగించి , చివరకు కొన్ని మల్లెలు , కొన్ని గులాబీలూ, కొన్ని రాలిన చేమంతులూ అన్నీ కలిపి పోసేందుకు ఒప్పందం కుదురుతుంది. ఇప్పుడు కాల్షీటుకు ఇరవై నిముషాలే టైం ఉంది. మూడు షాట్లు కుదరవు. అన్నీ కలిపి ఒకే షాటుగా చెయ్యడమే మార్గం.
దర్శకుడికే కాదు , అందరికీ బాధ అనిపిస్తుంది . అప్పుడు , అంతసేఫు నోరెత్తకుండా కూర్చున్న , కెమెరా అసిస్టెంటో లైట్ బోయో ధైర్యం చెబుతాడు " మీరు చెయ్యండి సారూ , మూడు షాట్లూ తీసేద్దాం కావాలంటే కాల్షీటుకంటే ఒక పది నిముషాలు లేటైనా ఫర్లేదులే " అని.
అంతసేపూ ఎంత చాదస్తంతో , అహంతో , నిర్లక్ష్యంతో వ్యవహరించిన వారికయినా ఆ క్షణంలో సినిమా మీది తమ ప్రేమ పెల్లుబుకుతుంది. యుద్ధంలా పని జరుగుతుంది. అనుకున్నది అనుకున్నట్లు రాకపోవచ్చు , కానీ ఏదో లా అనుకున్న షాట్లు మాత్రం వస్తాయి.
ఇదంతా కలిపితేనే GENERATION LOSS. రచయిత వ్రాసినదానికీ , దర్శకుడు ఊహించుకున్నదానికీ మధ్య ఇన్ని శక్తులు చేరి " నేను అనుకున్నట్లుగా ఈ సినిమా లేదే" అనేట్లు తయారవుతుంది. ఒక్కోసారి generation gain కూడా జరగొచ్చు, (నటీనటులు అత్యంత ఉత్తములైనప్పుడు) కానీ అది చాలా అరుదు.
సినిమా తీసే ప్రతివాడూ అనుభవించే ఘట్టం ఇది. ముఖ్యంగా independent film making లోనూ , ప్రేమతో సినిమా తీసే సందర్భంలో. ఆ షూటింగ్ సమయం అంతా నరకంలా ఉంటే, అయిపోయాక తలుచుకుంటే అదొక తియ్యటి అనుభవమే.
అలాంటి తియ్యటి అనుభవాన్ని కలిగించే ఒక సినిమా ఈ మధ్య తెల్లవారు ఘామున సోనీ పిక్స్ ఛానెల్‍లో చూసాను. ఎన్నోసార్లు ఎంతో మంది చెప్పినా ఎందుకో ఈ సినిమా చూడటం జరగలేదు. కానీ అనుకోకుండా చూసినప్పుడు, మనసంతా అటువంటి ఙ్ఞాపకాలతో నిండిపోయింది.
సినిమా తీయాలి అనుకునే ప్రతివాడూ , సినిమా పట్ల ప్రేమ చావని వారూ, తొలి షూటింగు అనుభవాలను గుర్తు చేసుకోవాలి అనుకునేవారూ తప్పక చూడాల్సిన..కాదు కాదు "అనుభవించాల్సిన" చిత్రం ఇది. పేరు : LIVING IN OBLIVION
ఆ సినిమాను నేను మళ్ళీ ప్రత్యేకంగా సమీక్షించను, ఎందుకంటే ఇంతసేపూ పైన చెప్పినదంతా ఆ సిన్మాకు నా ట్రైలర్ లాంటిదే. నటీనటుల ప్రతిమ, సినిమా తీసిన విధానం , బడ్జెట్ ఇవన్నీ నేను చెప్పడం కాదు సినిమా చూసాక మీకే తెలుస్తాయి. ఇది సినిమా కాదు , ఒక అనుభవం . ఒక శాంపుల్ ఇక్కడ ఇస్తున్నాను. ఎన్నో అవాంతరల తర్వాత చివరకు షాటు జరుగుతుంటే , ఎవరో చేతి వాచీ అలారం శబ్దం కారణంగా ఆ షాటు ఆగిపోతే ఆ దర్శకుడికి కలిగే ..వర్ణణాతీతమైన ఆ అనుభవం ..ఇదిగో...
ఈ సినిమాను నేను టీవీలో చూసాను కాబట్టి , చాలా బూతు మాటలు కట్ చేసారు.కానీ ఆ సందర్భాల్లో ఆ వ్యక్తులు ఆ మాటలు అనడమే ఉచితం అనిపిస్తోంది. ఇలాంటి సందర్భాల్లో కూడా వి/అనకపోతే ఇక బూతుమాట ఉనికికే అర్థం లేదు. కాబట్టి తప్పకుండా డౌన్‍లోడ్ చేసాక సౌండు బాగా పెంచుకుని, సినీ ప్రేమికులైన స్నేహితులెవరైనా ఉంటే కలిసి పార్టీ చేసుకుంటూ చూసుకోండి. లేదూ..ఒక్కరే చూసి మీలో మీరే మురిసిపోండి. సినిమాను ప్రేమించని / గౌరవించని వ్యక్తులెవరైనా ( స్నేహితులైనా/ స్పౌజ్ అయినా ) పక్కన ఉండనివ్వకండి. వాళ్ళకు ఇది అర్థం కాదు , నచ్చదు.
డీవీడీ దొరకనీ/ డౌన్‍లోడ్ చేసుకోలేని వాళ్ళు ముక్కలుముక్కలుగానే మొత్తంగా యూ ట్యూబ్‍లోనూ చూడొచ్చు , ఒక పార్టు చూస్తే రెండవ పార్టు లింకు కనిపిస్తుంది.
http://www.youtube.com/watch?v=xCwED9gZ2do&feature=related
ఫైనల్‍గా ఒక ఘలక్ :
పైన చెప్పిన షూటింగు ఉదాహరణలో , చివరకు అంతా గడిచాక, ఫుటేజ్ అంతా ఎడిటింగ్‍కు వెళ్ళాక అర్థమైంది , ఒక పే...ద్ద తప్పు జరిగిపోయిందని. అది ఏమిటై ఉంటుందో ఊహించండి , సినిమా తీయడంలో ఎంత టెన్షనో తెలిసొస్తుంది.
Thursday, April 22, 2010
అంతులేని మనిషి
ఇంటర్మీడియట్‍లో బైపీసీ గ్రూపులో ఉన్నప్పుడు, మొట్టమొదటిసారిగా " డిసెక్షన్" చేసినది ఒక కప్పను. ఒకపక్క ఈ డిసక్షన్ అంటే ఎలా చెయ్యాలో అనే ఉత్సాహం, పుస్తకాల్లో చూసి బట్టీ పట్టి నేర్చుకున్న బొమ్మల్లాగే ఉంటుందా ఈ కప్పలోపల అనే కుతూహలం ఒకవేపు, ఎగిరిపోతున్న కప్పను ల్యాబ్ అసిస్టెంటు మత్తు సూది ఇచ్చి నిస్త్రాణగా చేస్తుంటే జాలి ఒకవేపు. కప్పను చేతులూ , కాళ్ళూ లాగి మొదటిసారి డిసెక్షన్ బోర్డుకు సూదులతో గుచ్చినప్పుడు, నేను క్రిస్తియన్ కాకపోయినా ఎందుకో జీసస్‍ను శిలువ వేసిన ఘట్టం (కథల్లో విన్నదీ, సినిమాల్లో చూసినదే ) గుర్తుకొచ్చింది. ఏమో, కప్ప జాతుల్లో దేవుడిగా కొలిచే కప్ప నా చేతిలోకి వచ్చిందేమో !
సరే , నా కర్తవ్యం నేను నిర్వర్తించుకుంటూ పోగా, కప్పను విడదీసి, కడుపు తీసేసి , పేగులు బయటవేసి, ఊపిరితిత్తులు పొడిచివేసి ..ఇంత చేసినా ఆ గుండె కొట్టుకుంటూనే ఉంది. సరిగ్గా గుర్తులేదు కానీ దాదాపు పది నిముషాలసేపు. ఆ రోజు నాలో పుట్టిన అనుమానం , ఇంత చిన్న కప్పను మనం ఇంత టార్చర్ చేస్తే , ఇంకా దీని గుండె కొట్టుకుంటోందే , మరి మనుష్యులేంటీ యాక్సిడెంట్లలో ఠపీమని స్పాట్ డెడ్ అయిపోతారు. కప్పకే ఇంత స్టామినా ఉంటే మనిషికి ఇంకెంత ఉండాలో కదా ?
ఆ ప్రశ్నకు సమాధానం కోసం నేను అట్టే వెతకలేదు. ఎందుకంటే అందుకోసమని ఒక మనిషిని టార్చర్ పెడితే చూడలేం కదా. కానీ ఇన్నేళ్ళుగా ఆ ప్రశ్న నా సబ్‍కాన్షస్‍లో అలాగే ఉండి ఉందని ఈ రోజు అర్థమయ్యింది. కొన్ని జపాన్ సినిమాల ట్రయిలర్లు చూస్తూ, ఒక ట్రయిలర్ చూసి భయపడ్డాను.
తర్వాత ఒక యదార్థ సంఘటన ఆధారంగా ఆ సినిమా రూపొందించబడిందని తెలుసుకున్నాక గూగుల్ చేస్తే , వచ్చిన ఆ కేసు చదివి, మానవునిలోని మృగాన్ని తలుచుకుంటే ఒళ్ళు జలదరిస్తోంది. మనిషి ఇంత క్రూరంగా ఉండగలడా అనిపిస్తోంది. చాలాకాలం క్రితం నాన్కింగ్ ఊచకోత (ఇది కూడా జపనీయులపైనే జరిగింది) చదివినప్పుడు కలిగిన కంపరం మళ్ళీ కలుగుతోంది. ఆ రెండూ నేను వ్రాయలేను, ఇవిగో లింకులు.
ఈ ఆధునిక ప్రపంచంలో కూడా మనిషి ఎంత క్రూరంగా ఉండగలడో తెలుసుకోవాలి అనుకునేవాళ్ళు మాత్రమే అవి చదవండి. దారుణమైన వార్తలు విని వాంతులు చేసుకునేంత బలహీనులు అయితే ఈ లింకులు ముట్టుకోకండి, ముందే వార్నింగ్ ఇస్తున్నా.
http://en.wikipedia.org/wiki/Junko_Furuta
http://en.wikipedia.org/wiki/Nanking_Massacre
ఇక, పైవి చదివినవాళ్ళకోసం , ఒకవేళ , రాష్టాలు విడిపోయేందుకు సివిల్ వార్‍లో లేక పక్కనున్న చైనా లేక పాకిస్థానులతో యుద్ధాలో వస్తే , మనవాళ్ళూ ఇలాగే బలి అవ్వడమో లేక అత్యాచారం చెయ్యడమో ఏదో ఒకటి జరగొచ్చు కదా. ఆ రకంగా చూస్తే ఏ గొడవాలేకుండా మనం చా....లా ప్రశాంతంగా, సుఖసంతోషాలతో ఓలలాడుతున్నట్లే. మనిషిలో అంతర్గంతంగా జంతువుకంటే క్రూరమైన, నీఛమైన గుణాలను వెలిబుచ్చేందుకు ఏ కారణం దొరకకపోవడమే ప్రపంచశాంతి అనిపిస్తోంది. కప్ప కావొచ్చు, జీసస్ కావొచ్చు, ఫ్యురుటోనో ఇంకోరో కావొచ్చు , ఎంత క్షోభ అనుభవించారో మనిషి క్రూరత్వానికి. ఆత్మలే నమ్మని నేను వాళ్ళ ఆత్మశాంతిని కోరలేను, జరిగినవాటికి బాధపడటం తప్ప.
మొత్తానికి ఇవన్నీ చదివాక నాకు తెలిసిన సత్యం :
బాధను భరించేందుకు అంతు ఉందే కానీ , బాధించేందుకు హద్దుల్లేనంత క్రూరత్వం మనిషికి స్వంతం అని.
కొన్ని ఆలోచనలు నాకు తెలుగులో కంటే ఇంగ్లీషులోనే ఎక్కువ మనసుకు దగ్గరగా అనిపిస్తాయి. ప్రస్తుతానికి నేను అలా మననం చేసుకుంటున్నది :

There seems to be a limit to the amount and intensity of pain a human being can bear, but when it comes to inflicting pain we are endless.
Tuesday, April 20, 2010
కళ్ళకు కనిపించని సినిమా ! తెలుగులో కూడా వస్తే!
సినిమామీద వ్యామోహంతో , శాస్త్రీయంగా దాన్ని చదువుకునేందుకు కాసిన్ని పుస్తకాలూ సినిమాలు చదివాక నేను నేర్చుకున్న సినీ గ్రామరును జనరంజకంగా సినిమాలు తీయడంలో ఎలా ఉపయోగించాలా అని తర్జనభర్జనలు పడుతున్న కాలంలో , ఈ మధ్య మన తెలుగులో సినిమాల మీదా , వాటి గ్రామరు మీదా జరుగుతున్న చర్చలలో నా గొంతు కూడా వినిపేంచుందుకు , నాకు బాగా ఇష్టమయిన ఒక దక్షిణ కొరియన్ సినిమా : Spring, Summer, Fall, Winter ... and Spring(దర్శకుడు : కిమ్ కి డుక్ )లోని మొదటి పది నిముషాలను సోదాహరణంగా వివరిస్తూ, నే చెప్పొచ్చేదేమంటే :
ఇపుడు మన కంటికి కనిపించే కథ (అహింస గొప్పదనం , ఒక జీవిని హింసిస్తే నువ్వు ఆ బాధను జీవితాంతం మోస్తావు అని సంభాషణ ద్వారా ప్రస్ఫుటంగా చెప్పే భావం) కాక, కొంచెం ఆలోచిస్తే చాలా కథలు ఉన్నాయి. ఎక్కువ అర్థాలు దర్శకుడు అనుసరించే బౌద్ధ జెన్ తత్వాలనుండి పుట్టాయి. మన హిందూ తత్వాలకు దగ్గరగానే ఉంటాయి . (చదువుతున్నవారెవరైనా అన్యమతాల వారూ , మతాలకు అతీతులు అయినప్పుటికీ ఈ దృశ్యకావ్యాన్ని అర్థం చేసుకోవాలంటే ఆ మతాన్నికోట్ చెయ్యక తప్పని నా నిస్సహాయ స్థితిని అర్థం చేసుకోమని అర్థిస్తున్నాను )
అసలు సినిమా టైటిల్ ప్రకారం , ఇది తొలి భాగం అయిన వసంత ఋతువు. బాలుడితో మొదలయ్యే ఈ కథలో , ఆ ఇల్లు అలా ఎందుకు ఉండాలి ? ఏం అడవిలోని పూరి గుడిసె ఎందుకు కాకూడదు ? అలా నీటి మధ్యలో తేలుతున్నట్లు కన్పించే ఇల్లే ఎందుకు కావాలి ? కేవలం మన కంటికి అందంగా కనిపించడం కోసమే కాదు. అక్కడ దర్శకుడి ఆలోచన , మనం ఉన్న ప్రపంచం , అనగా భూమి, నీటి మధ్యలో ఒక ద్వీపం వంటిదే అని. కనుక, ఈ ప్రపంచంలోని మనిషి జీవితం గురించి చెప్పాలి అనుకుంటే అందుకు అనువైన అతగాడి ఇల్లు ఇలా మూడొంతుల నీటి మధ్య ఉంటేనే సరి అనుకున్నాడు దర్శకుడు.
ఇక్కడ మనుష్యులుగా ఉన్న పాత్రలు ఇద్దరు. (ఇల్లూ, నీరూ, ఋతువూ, జంతువులూ కూడా ఒకరకంగా పాత్రలే అయినప్పటికీ ) కానీ కొంచెం లోతుగా ఆలోచిస్తే , హిందూ / బౌద్ధ ధర్మాల ప్రకారం గురువు భగవంతుడు. ఆ విధంగా చూస్తే ఇక్కడ పిల్లవాడు మాత్రం మానవాడు, అతగాడి గురువు భగవంతుడు. ప్రతిక్షణం తనను ఎవరూ చూడటం లేదు అనుకుని సాటి జీవుల పట్ల నిర్దయగా ప్రవర్తించే మనిషికి తనను భగవంతుడు నిరంతరం గమనిస్తూనే ఉంటాడని గుర్తుంచుకోవాలి. ( చదువుతున్నవారెవరైనా నాస్తికులయితే నన్ను తిట్టకండి, ఆ దర్శకుడి భావం అది )
ఇక ఆ అబ్బాయి ఎంచుకున్న జీవులు వరుసగా : చేప , కప్ప, పాము . ఏం ఆ వరుసలోనే ఎందుకు ఉండాలి ? పాము , చేప , కప్ప ఎందుకు కాకూడదు ? జువాలజీ ప్రకారం అయినా బౌద్ధ సిద్దాంతం ప్రకారం అయినా నీటిలో ఉండే జీవి మొదటిది , ఉభయచరం తర్వాతది, నేలమీద మన్నేది మూడవది. మరి పక్షిని ఎందుకు వదిలేసినట్లు ? మనిషి , విమానం వంటి సాంకేతిక ఙ్ఞానం పక్కనబెడితే , నేలమీద ఉండగలడు , చాలా సేపు ఈత కొట్టగలడు కానీ ఎప్పటికీ ఎగరలేడు. అందుకే గాలిలో ఎగిరేవి మనిషి జీవితాన్ని గురించి చెప్పడానికి సరిపోవని దర్శకుడు ఆ మూడు జీవాలతో తన భావప్రకటన ఆపాడు. అప్పటికీ పక్షి కాకపోయినప్పటికీ, మొట్టమొదటగా ఆ బాలుడి చేతులు ఎగురుతున్న చిన్న సీతాకోకలమీదకే వెళ్తాయి, కానీ అవి అందని కారణంగానే అతను తనకు సంబంధించిన భూమీ, నీటిమీద ఉండే జంతువులమీదే తన ప్రతాపం చూపుతాడు.
ఇక్కడ ముఖ్యంగా గమనించవలసింది మూడవ జీవి అయిన పాము. భూమిపై చరించే ప్రాణిని చూపించాలి అనుకుంటే సర్పాన్నే ఎందుకు చూపించాలి ? కుక్క, పిల్లి, ఉడుత లాంటి సాధు జంతువులో లేక పులి,సింహంవంటి క్రూర జంతువులో ఎందుకు కాకూడదు ?పాము, ఒక రకంగా సాధు జంతువూ మరో రకంగా ప్రమాదకరమైనదీనూ. అచ్చంగా మనిషిలానే. కానీ ఈ పాము, ఒక కరవని పాము. అంటే నిస్సహాయమైన పాము. భూమి మీద చరించగలిగేదీ , కరిచేంత విషమున్నదీ , అయినా ఒక పసివాని చేతిలో నిస్సహాయంగా దొరికిపోతుంది. ఇక్కడ పాము ఆ శిశువుకు(అనగా మనిషికి ) ప్రతిరూపం. హిందూ/బుద్ధిస్ట్ తత్వం ప్రకారం, పాము కర్మ కు సూచకం. నిరంతరం కుబుసం విడుస్తుంది కనుక దాని జీవితాన్ని పుట్టుక, మరణం , పునర్జన్మ అనే ఒక సుడిలో తిరిగే "కర్మ"గా చూస్తారు. అందుకే ఇక్కడ పామును ఎంచుకున్నాడు దర్శకుడు.
ఇక పోతే , రాయి కట్టబడ్డాక మూడు జంతువులకూ వివిధరకాలయిన మృత్యువు. నాకు ఇప్పుడు సరిగా గుర్తు లేదు కానీ, వాటి వెనుక కూడా ఏదో బౌద్ధ తత్వాలు ఉన్నాయి. ఒకసారి ఆ పాము చనిపోయిన విధానం గమనించండి. దాని శరీరం నీటినీ,నేలనూ తాకుతూనే ఉంది. పామును ఇక్కడ మనిషితో పోల్చాడు కనుక, ఆ పాము మృత్యువు మరింత భయంకరంగా జరిగినట్లు , రక్తం ఓడుతూ, నేలకూ నీటికీ రెండిటికీ చెందకుండా పోయింది. ఒకరకంగా అది మిగతా జీవులందరికన్నా సాటి మనిషిని హింసిస్తే మరింత పాపం చేకూరుతుంది అని చెప్పడానికి ఆ శిశువు తట్టుకోలేక విలపించినట్లు చూపడం.
ఇదేమీ నా సొంత పైత్యం కాదు. ఒక ప్రసిద్ధుడయిన సినీగురువు చెప్పగా విన్నాను. ఈ చిత్రం గురించి ఇలా వివరంగా వ్రాసిన పుస్తకమూ చూసాను. ఈ సినిమా గొప్పది అని కీర్తించిన ప్రపంచ దేశాల్లో , విమర్శకులందరూ ఒప్పుకునే అర్థాలే ఇవి. ఇంకొందరు ఇంకొక అడుగు ముందుకు వేసి , వాళ్ళు వేసుకున్న బట్టల రంగులకూ , చెప్పుల రంగులకూ కూడా ఏవో తత్వాలు ఆపాదించారు కానీ అవన్నీ చెప్పుకుపోతే అదొక అడవి అని నేను ఇంతటితోనే ఆపుతున్నాను.
ఇదంతా చా...లా... "అతి" అనిపించినా కిం కీ డుక్ సినిమాలన్నిట్లోనూ ఇలాంటి గుప్త సందేశాలు చాలా ఉంటాయి. పైన పేర్కొన్నవన్నీ కథతో సంబంధించిన "మెటోఫర్" మాత్రమే అయితే, ఇంకా గొప్ప దర్శకులు అని కీర్తింపబడేవారి చిత్రాల్లో , ఫ్రేములోని పాత్ర ఎడమనుండి కుడి వైపుకు చూస్తున్నాడా, కుడినుండీ ఎడమకా, లైటు అతడి కళ్ళ్కు మాత్రమే ఉందా, ముఖం మొత్తం ఉందా, సగమే ఉందా, ఎడిటింగ్ స్మూత్‍గా ఉందా జంప్ కట్‍తో సాగిందే అంటూ, ప్రతి గ్రామరు అంశంతోనూ అర్థం మార్చగలరు.
అకీరా కురుసోవా సినిమాలను ఎన్నెన్నె రకాలుగా విశిదీకరిస్తారో...చివరకు, షాట్ల సంఖ్యలు , వాటి నిడివిని కూడా లెక్కలు వేసి , అనేందుకు ఉదాహరణగా ఈ లంకె చూడగలరు. http://www.theauteurs.com/notebook/posts/391 . మన రే సినిమాల్లో ఋతువుల గురించి కానీ, షాట్ కంపోజిషన్‍లో ఉయ్యాలవంటివి ఉంచడం ద్వారా సందిగ్ధాన్ని చెప్పడం గానీ, ఆదూర్ గారి సినిమాలను(ఎలియపతెంలో మనిషిని ఎలుకతో పోల్చడం ) కూడా ఇలా చూసే కొద్దీ లోపలి కథలు ఎన్నో బయటపడ్తాయి.
ఇదంతా నాణానికి ఒకవైపు. మరోవైపు ఉన్న కఠోర సత్యం , విమర్శకులు లేక సినీప్రేమికులు , ఇప్పటికే పేరుప్రఖ్యాతులు సంపాదించుకున్న దర్శకుల సినిమాలను అయితే ఇంత ఓపికగా విశిదీకరించి / చీల్చిచెండాడి వాళ్ళు ఆపాదించని అర్థాలను కూడా వెతికిపట్టుకుని పొగడటానికి సిద్ధంగా ఉంటారు. ( అప్రస్తుత ప్రసంగంలా అనిపించినా చెప్పక తప్పట్లేదు . మిస్టర్ బీన్స్ హాలిడే అనే చిత్రంలో..కేన్స్ ఫెస్టివల్‍లో ఒక దర్శకుడి చిత్రం ప్రదర్శితమవుతుండగా బీన్ వలన జరిగిన ఒక తప్పిదాన్ని ప్రేక్షకులు సినిమా ప్రక్రియలో భాగం అని తలపోసి ఆహా ఓహో అని పొగుడుతారు ) తెలుగులో శంకరాభరణం ఒక కల్ట్ స్టేటస్ సంపాదించుకున్నప్పుడు కొన్ని పత్రికల్లో ఇలాంటివి వచ్చాయట. ఉదాహరణకు, ఒక షాట్‍లో శంకరశాస్త్రి పడుకున్న భంగిమ వీణలా కనిపించడం, విశ్వనాథ్‍గారు అదే పనిగా కంపోజ్ చేసిన భంగిమ అనీ..వగైరా.. కానీ మర్యాదస్థులు, తమ పరిమితులు తెరిసినవారు ఆ పెట్టుడు భుజకీర్తులను తిరస్కరించడం జరిగింది. ఇలా, చాలా సార్లు, పెద్ద దర్శకుల సినిమాలలో ప్రతి షాట్‍లో అంతరార్థం వెదకడం ఒక పిచ్చిగా ఉండేవాళ్ళూ ఉన్నారు. అదే ఒక వృత్తి కూడా. ఇంటర్నెట్‍లో ఏ పేరు పొందిన ప్రపంచ సినిమా బ్రేక్ డౌన్ గురించి వెదికినా బోలెడు యూనివర్సిటీ పేపర్ శాంపుల్స్ ఉంటాయి, అన్నీ పెయిడ్ సైట్లే! కానీ , ఒక కొత్త దర్శకుడు ఇలా ప్రయత్నిస్తే ఆ కళను గుర్తించేంత వ్యవధీ , ఓపికా ఈవేళ్టి ప్రపంచానికి లేదేమో అనిపిస్తుంది. ఋజువుగా, నేను ప్రయత్నించి ఎవ్వరూ గుర్తించక నిరాశతో వదిలేసుకున్న షార్టు ఫిలిమూ, నాకు తెలిసినవారు కొందరు వెర్రిఆరాటంతో అలాంటి సినిమాలు తీసినప్పుడు ఏ గుర్తింపూ రాక ఇక జన్మలో కళాత్మక సినిమా జోలికి వెళ్ళకూడదు అని విసిగిపోవడం చూసాను. ఈ నిరాశ కొత్తవారికే కాదు ఒక ఇమేజ్ చట్రంలో ఇరుక్కున్న ప్రఖ్యాత దర్శకులకూ తప్పదు.
ఉదాహరణకు, ఆల్ఫ్రెడ్ హిచ్‍కాక్ సైకో దాదాపు మనందం చూసి ఉంటాం. అందులోని షవర్‍లోని హత్య సన్నివేశంలోని భయం అనుభవించాం. ఒక ఇంటర్వ్యూలో హిచ్‍కాక్ చెబితేనే తెలిసింది అందులో ఒక షాట్ వెనుక ఆయన ఉద్దేశ్యం. షవర్‍లోని మహిళను సైకో పొడిచినప్పుడు , కాళ్ళకు ఒక క్లోజప్ షాట్. ఆ షాట్‍లోనే , ఆమె కాళ్ళను కదుగుతున్న నీటిలో రక్తం కలిసి టబ్బులో ఇంకిపోవడం. క్రైస్తవ ధర్మాన్ని ఆచరించే ఆల్ఫ్రెడ్ , "బాప్టిజం" కు సంకేతంగా ఆ షాట్ డిజైన్ చేసారట. దొంగతనం అనే పాపం చేసిన ఆ పాత్రయొక్క పాపం అలా రక్తంతో కరగబడడమే దైవం విధించిన శిక్ష అని ఆయన మనోభావం అట. కానీ హిచ్‍కాక్‍ను కమర్షియల్ దర్శకుడిగానే చూసే విమర్శకులెవ్వరూ ఆ ఆలోచనను గుర్తించే ప్రయత్నమే చేయలేదు.
ఇంకో ఉదాహరణ : రెండేళ్ళ క్రితం మణిరత్నంతో పనిచేసే ఒక అత్యుత్తమ సాంకేతిక నిపుణుడు చెప్పాడు. " యువ" చిత్రంలో , మాధవన్ పాత్ర దారీతెన్నూ లేనిదిగానూ ,డిస్టర్బ్డ్‌గానూ ఉంటుంది కనుక అతని సన్నివేశాలన్నీ హేండ్‍హెల్డ్ కెమెరాతో , జెర్కీగా తీయగా, ఒక స్థిరత్వం కలిగిన సూరియ పాత్ర ఉన్న సన్నివేశాలు ట్రాక్‍లూ, స్టాటిక్ కెమెరాతోనే ..స్థిరంగా చిత్రీకరించినట్లు. కానీ మణిరత్నం సినిమాలో ఇలా గూడార్థాలు వెదకడం ఏమిటని మన విమర్సకుల చిన్నచూపు. అలాగే గీతాంజలి చిత్రంలో , గిరిజను ప్రేమించాలి అని నిర్ణయించుకున్నాక సిగిరెట్టు పారేసి , చెట్ల మధ్య, సూర్యుడు వెనుకరాగా నాగార్జున నవ్వుముఖంతో పరుగుతీసే షాట్ వెనుక గూడార్థం కొంచెం ఆలోచించి చూస్తే మీకే తెలుస్తుంది.
సరే గొప్ప సినిమాలూ , మంచి సినిమాలూ, మరీ అంత గొప్పవి కాని సినిమాలూ కాదుగానీ, చివరాఖరుకి పరమ చెత్త సినిమా అనుకునేవాటిలో కూడా దర్శకుడు కళ్ళకు కనిపించేది , చెవులకు వినిపించేది కాక ఇంకేదో చెప్పాలి అనుకుంటాడు. బూతు పాటను తీసేందుకు కూడా , తెల్లటి మేనిఛాయ ఉన్న అమ్మాయిని ఎర్రటి రంగు డ్రస్సులో చూపితేనే మగ ప్రేక్షకుడికి కిక్కొస్తుంది అని నమ్మే దర్శకుడు ఎర్ర చీర , ఎర్రటి లిప్స్టిక్, ఎర్రటి ఆపిల్ పళ్ళు, సాహిత్యంలో ఎరుపు అనే మాట , ఇంత ఎర్ర చేసే రకాలూ ఉన్నారు. ఏం నల్ల డ్రస్సులో ఆ అమ్మాయి బావోదా అని అడక్కండి. ఆ డైరెక్టరు ఫాంటసీ అలా తగలడింది మరి.
ఇంతకీ ఇదంతా చెప్పడం ఏమిటంటే , సంభాషణలతో తెలిసే కథ కాకుండా సినిమాలోని ప్రతి అంశం వలనా ఒక కథ చెప్పొచ్చు. కానీ , ఆ కథను అర్థం చేసుకోవడానికి ప్రేక్షకుడి అవగాహన ముఖ్యం. ఛంథోబద్ధమైన ఒక అచ్చతెలుగు పద్యాన్ని వినిపిస్తే అర్థం చేసుకోలేని "తెలుగు"లో ఉన్నాం మనం. మనకు అర్థం కాలేదు కనుక, ఈనాటి మన దైనందిక జీవితానికి పనికిరాదు కనుక . తెలుగు ఛందస్సు వృధా అని , సామాన్యుడికి అక్ఖర్లేని ఆ పద్యాలూ, ప్రబంధాలు ఎందుకనీ అంటే కొన్నాళ్ళకు వాటి ఉనికి ఉండదు. అలాగే , మన తెలుగులో ఏ ఆటోవాడికో (క్షమించాలి, వృత్తిని కించపరచడం నా ఉద్దేశ్యం కాదు, అంత చదువులేని వాడు అనే అసంప్షన్‍తో అంటున్నాను ... దీనికి నా ఆధారం ఒకసారి రాంగోపాల్‍వర్మ ఇంటర్వ్యూలో నెల్లూరులో రిక్షావాడికి నా సినిమా అర్థం కాకపోతే నాకేం నష్టం లేదు అనడమే ) లేక సాఫ్టవేర్ ప్రోగ్రామ్ లాంగ్వేజీ తప్ప ఇంకేమీ రాక కేవలం డ్యాన్సుల కోసం , బ్రహ్మానందం హాస్యం కోసం సినిమా చూసేవారికో , లేక ఎవరెవరికో అర్థం కానంత మాత్రాన కళాత్మక సినిమా అనేదే మనకు అనవసరం అనే మన సంకుచిత స్వభావం వలనే ఇన్నేళ్ళ తెలుగు చరిత్రలోనూ ప్రపంచ సినిమాతో నిలబెట్టి చూసుకోగల సినిమాలు లేకపోవడానికి కారణం. మన దేశంలో ఎంత ఎక్కువమంది సినిమాను , దాని గ్రామర్‍ను చదువుకుంటే ( క్షుణంగా కాకపోయినా ప్రాథమికంగా అయినా ) అంతగా గొప్ప సినిమాలు వచ్చేందుకు ఆస్కారం ఉంది. మనం ప్రస్తుతానికి అంత విద్య లేనివాళ్ళం అనే నిజాన్ని ఒప్పుకుని, మనకు తెలిసిన విఙ్ఞానాన్ని సరి అయిన చర్చలతో పంచుకుంటే మనకు కనీసం భవిష్యతులో అయినా తెలుగునుండి ఒక గొప్ప సినిమా ఆవిర్భవించే అవకాశం ఉంటుంది.

Wednesday, April 14, 2010
అరంగేట్రం
నేనూ మొదలెడ్తున్నా... బ్లాగింగ్
మునుపు, అంటే చాలా కాలం క్రితం.. ఎప్పుడూ అంటే , తెలుగులో బరహా కూడా రాక మునుపు మూడు సందర్భాలలో మూడుపేర్లతో ఇంగ్లీషు బ్లాగులు నడిపి...నాకొచ్చిన పిచ్చి ఆలోచనలన్నిటినీ క్రికెట్ స్కోరులా లైవ్ అప్డేడ్ చేసి తద్వారా కొందరు స్నేహితులనూ , ద్వేషితులనూ ( ఎవరూ పుట్టించకపోతే కొత్త పదాలెలా వస్తాయ్? ) సంపాదించుకుని నాకు మనసు బావోలేనప్పుడల్లా కాగితాలనూ పుస్తకాలనూ నలిపి , చించేసి , పారేసే ఎదిగీఎదగని మనస్తత్వం ఉన్న ఆ రోజుల్లో ఆ బ్లాగులనూ అలానే డిలీట్ చేసి... ఇకెప్పుడూ నిరంతరం చేస్తాను అన్న భరోసా రానిదే ఏదీ మొదలెట్టకూడదు అని నిర్ణయించుకున్నాక... ఇన్నాళ్ళకు... ఆ స్థితికి చేరుకున్నానన్న నమ్మకంతో మళ్ళీ మొదలెడుతున్నాను.
ఎలాగూ తెలుగు వ్రాసే సౌకర్యం ఉంది కనుక, ఎక్కువ భాగం తెలుగులో సాగినప్పటికీ నా భావావేశాన్ని అనుసరించి అప్పుడప్పుడూ ఇంగ్లీషూ , తెంగ్లీషు పోస్టులూ ఇక్కడ కనిపిస్తాయి. ఇకపోతే , మరీ ఏదో నియమం పెట్టుకున్నట్లు... టపాలు , వ్యాఖ్యలు, నొక్కండి , తొక్కండి అని ప్రతిదీ తెలుగులోనే ఉండాలనే నియమం లేదు నాకు. చేతికి వాచి లేనప్పుడు ఎదురుపడిన వ్యక్తిని "టైం" ఎంతయ్యిందని అడుగుతానే కానీ మీ చేతి గడియారమందు సమయం ఏమని సూచింపబడుతోంది... అని అనగలిగే రోజునే ప్రతి పదమూ తెలుగులో ప్రచురిస్తాను.
సరే ఇక విషయసూచిక :
చిన్న పొట్టి కథలు , కవితలు
పుస్తక సమీక్షలు ( నేను చదివినవి , చదవాలి అనుకున్నవి , చదవకుండా వొద్దనుకున్నవి కూడా )
సినీ సమీక్షలు
నేను తెలుసుకున్న ప్రపంచంలోని అత్యంత అద్భుతాలూ , ఘోరాలూ
సమాజం మీద ఆగ్రహావేశాలు
గట్రాలు , వగైరాలు... ఇక్కడ అడ్డదిడ్డంగా కనిపిస్తాయి. నేనేవీ కూర్చి పెట్టను. ఎవ్వరిక్కావల్సినవి వారు వెదుక్కుని చదువుకోవచ్చు లేకపోతే నా బ్లాగు అస్తవ్యస్తంగా ఉందని తిట్టుకుని పోవచ్చు.
ఒకటి మాత్రం ఇక్కడ నిషిద్ధం : కామెంట్ల సెక్షనులో ఊరూ పేరూ లేకుండా తిట్టుబోతు వ్యాఖ్యలను అస్సలు సహించను. ఇదొక్కటే ఇక్కడి రూలు. రూలు నెంబరు రెండు ఏదీ లేదు కాబట్టి ఉన్న ఆ ఒక్క నియమాన్నీ పాటిస్తారనీ ఆశిస్తూ.......
విప్లవ్

Subscribe to:
Comments (Atom)