వారం క్రితం చూసిన న్యూసు ఇంకా వెంటాడుతూనే ఉంది.
ఈ టీవీలో చిన్న ఫ్లాష్ లాగ వేసారు, శ్రీకాకుళం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లోని ఒక గ్రామంలో (పేరు గుర్తుపెట్టుకుందాం అంటే ఆ ఫ్లాష్ మళ్ళీ రాలేదు ) దాదాపు 550మంది నెలరోజులుగా విషజ్వరాలతో బాధపడుతున్నారు. 7కిలీమీటర్లు వెడితే కానీ డాక్టరు లేరట. అక్కడా సరి అయిన వైద్యసదుపాయాలు లేక ఇళ్ళల్లోనీ ఉండి , చచ్చిపోతున్నారట.
ఏదో ఆటవిక కాలం నాటి జీవితంలా అనిపించిన ఆ వార్త గురించి మరింత తెలుసుకుందాం అంటే మళ్ళీ ఫ్లాష్ రాలేదు. జగన్ యాత్ర అనో , మైనింగ్ కుంభకోణం అనో , టీటీడీ అవినీతి అనో ఫ్లాష్‍లు వస్తున్నాయి. మిగతా ఛానెల్స్‌లో అయితే అసలు ఈ ఊసే లేదు.
అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అని old సామెతకు సరి అయిన అర్థం ఏమిటో కానీ , అదే గుర్తుకువస్తోంది. శ్రీకాకుళం నేనెప్పుడూ వెళ్ళలేదు. ఏజెన్సీ ప్రాంతాలు అంటే వినడమే కానీ చూడలేదు. అవి ఎంత మారుమూలవైనా, హైద్రాబాదునుంచి చెన్నై, బెంగుళూరు, ముంబై, అమెరికాల కంటే ఖచ్చితంగా దగ్గరగానే ఉండే ప్రాంతాలు. మరి అంత దగ్గర్లో ఉంటూ, అవి unreachable ప్రాంతాలు ఎలా అయ్యాయీ ? ఎంత రోడ్లు లేకపోయినా , ఏదో ఒక దారి ఉండదా ? న్యూస్ ఐటమే కానీ, వీడియో footage సంపాదించని జర్నలిజం ఏం చెబుతోంది ?
పెద్దగా ప్రేక్షకుల ఆసక్తిని పట్టలేని న్యూసును అంతగా చెప్పక్ఖర్లేదు , తెలుస్కోవడానికి కష్టపడక్ఖర్లేదు అనా ?
సరే...మీడియాలూ , న్యూసులూ , జనాలూ , గవర్నమెంట్లూ అన్నీ తగలడిపోనీ ?
550మంది అంటే.... చా........లా... ఎక్కువ కదూ ? అందులో పెద్దలెందరో , పిల్లలెందరో , ముసలోళ్ళెందరూ, ఆడాళ్ళూ అందులో గర్భిణులూ ఎందరున్నారో ఏమిటో ? విషజ్వరాలు అంటే ప్రాణాంతకమైనవి.ఈ రిపోర్టరు సరిగా చెప్పలేదు కానీ , అసలవి ఏ జ్వరమో ? malaria, dengue, encephalitis , pyrexia of unknonw origin....ఎన్నెన్నో రకాలు. ఏదో తెలుసుకోవాలంటే సరి అయిన lab and diagnostic facilities కావాలి. drugs like paracetomol , acetaminophen , diclofenac లాంటి symptomatic relief ఇచ్చేవే కూడా సరి అయిన క్వాలిటీవీ కావాలి. ( ఈ మధ్య ఏదో పేపర్లో చదివా గవర్నమెంట్ హాస్పిటళ్ళలోనూ, ప్రైవేటులో తక్కువ రేటుకు దొరికే ఈ డ్రగ్స్ అన్నీ ఎఫెక్టును కలుగజేసే మోతాదు లేనివీ , పసలేనివీ అని ). తర్వాత , సరి అయిన anti-biotic , antimalarial , antiviral . ఏవో జబ్బునుబట్టి నిర్థారించి అవి ఇవ్వగలగాలి. జ్వరాలతో పాటు విరోచనాలు ఉంటే ringer lacatate, normal saline, metrogyl solutions కావాలి. అవన్నీ administer చెయ్యడానికి , దాచడానికి ఎక్విప్‍మెంట్ కావాలి.
ఇవన్నీ ఎక్కడ నుంచి వస్తాయి ??
డబ్బు పెడితేనే ?
లేకపోతే ఏ ఛారిటీ సంస్థవాళ్ళో "దానం" "ధర్మం" చేస్తే.
డబ్బుతో ఈ మెడిసిన్లూ గట్రా వస్తే , తర్వాత అవి ఉపయోగించడానికి డాక్టర్లో , నర్సులో కావాలి. man power.
so money power and man power is what ultimately lacking.
ఇంతమంది మనవాళ్ళు" "మన" ఆంధ్రప్రదేశ్‍లోని వారూ..అలా నిష్కారణంగా చచ్చిపోతుంటే ...ఆ మనీ , మ్యాన్ పవర్లు ఉన్నవాళ్ళంతా చెత్త మాట్లాడుతూ ఉంటే ,
మనం కూడా ఏమీ చెయ్యలేమా ??
ఏమైనా చేద్దాం అంటే idea ఇవ్వండి. చేద్దాం. సమీకరిద్దాం. ఈసారికి కాకపోతే మరోసారి ఇలాంటి న్యూస్ వస్తే బయలుదేరుదాం. కానీ...అరకొరా బలంతో కాదు. పూర్తిస్థాయి శక్తి ఉంటేనే ...ఇలాంటివి విజయవంతంగా పూర్తిచేయగలం.
నేను ఒక చిన్నపాటి ఛోటా ఎంబీబీయస్ డాక్టరును. ప్రాక్టికల్ అనుభవం తక్కువగా ఉన్నవాడిని. ప్రాక్టీసులో లేనివాడిని. అయినా నాకు చేతనైంతలో నా ప్రయత్నం చేస్తాను. సంఘాలు వొద్దు, గ్రూపులు ఒద్దు , స్నేహాలూ , భావజాలాలూ ఒద్దు. objectiveగా , ఇలాంటి సమయాల్లో ఏమైనా చెయ్యగలం అనిపిస్తే ఒక మెయిల్ దూరంలో ఉండండి. ఏం చెయ్యాలో చెప్పండి.. ngoలు, charity నెలకొల్పడాలు వాటిల్లో నాకు నమ్మకం లేదు. కాబట్టి అవి తప్ప.
Subscribe to:
Post Comments (Atom)
4 comments:
Share your email or create a new email for this purpose. I will lend my hand for this cause.
iamviplove@yahoo.co.in
డియర్ విప్లవ్...
మీ పోస్టూ.. దానిలోని ఫీలింగ్సూ గురించి కాదు.. వాటితో భేదాభిప్రాయం ఏమీ లేదు..
"ఈ టీవీలో చిన్న ఫ్లాష్ లాగ వేసారు...."
"న్యూస్ ఐటమే కానీ, వీడియో ఫుటేజ్ సంపాదించని జర్నలిజం ఏం చెబుతోంది ? పెద్దగా ప్రేక్షకుల ఆసక్తిని పట్టలేని న్యూసును అంతగా చెప్పక్ఖర్లేదు , తెలుస్కోవడానికి కష్టపడక్ఖర్లేదు అనా ?"
ఈటీవీలో పని చేస్తున్న ఓ జర్నలిస్టుగా ఈ వాక్యాల మీద చిన్న వివరణ.
సాధారణంగా ఇలాంటి వార్తలను వదిలిపెట్టేసేంత తోలుమందం ఇక్కడ ఇంకా పూర్తిగా లేదు.... రాజకీయ భావజాలాలూ, వ్యక్తిగత భేదాభిప్రాయాలూ ఎలా ఉన్నా.
శ్రీకాకుళం ఏజెన్సీలో విష జ్వరాల తీవ్రత అంత స్థాయిలో ఉన్నప్పుడు (మీ టపా చెబుతున్న కథనం ప్రకారం) వాటికి సంబంధించిన ఫాలో-అప్ కచ్చితంగా ఉంటుంది.
నేను మీ టపా రెండేళ్ళ తర్వాత చదువుతున్నా కాబట్టి దాని వివరాలు ఇప్పుడు చెప్పలేకపోవచ్చు. కానీ అలాంటి కథనాలను డెస్క్ ఎండ్ నుంచి చాలా సార్లు ప్రసారం చేసిన వాడిగా చెబుతున్నా.
అంత పెద్ద వార్తని ఒక న్యూస్ ఫ్లాష్‌తో వదిలేయం. కచ్చితంగా స్టోరీ వేసే ఉంటాం.
మానవత్వం సంగతి కాకపోయినా కనీసం వార్తగానైనా విలువ ఉన్న విషయమే కదా.
నిజానికి ఇప్పుడు మీ బ్లాగ్‌ని వెనక్కి చదువుకుంటూ వెడుతుండగా ఈ పోస్ట్ చూసా.. ఈ వ్యాఖ్య ప్రచురించకపోయినా నో ప్రాబ్లెం.
Sorry puranapandaphani garu
i dint check this blog for long
thats why dint see ur comment
i dont remember the exact details now
but..even if as u say there has been a "STORY FOLLOW UP " i feel , thats not enough
such things shud be presented like emergencies , i feel .
see like how channels pay spl interest in a celebrity's marriage giving live feed for 24hrs...when ppl r dying n an advancing danger that a fever may spread why cant that kind of news be made the toppest priority ??
thats wht i feel..
Post a Comment