Sunday, July 04, 2010
పెళ్ళాం
పరిచయం :
మొట్టమొదటగా అయితే నచ్చలేదు నువ్వు
ఏముందని మరి స్పెషల్
అందరిలాంటిదే ముక్కూమొహం నవ్వూ
ఎంత టేస్టీ అయినా ఇడ్లీ ఇడ్లీనే కదా...రొటీన్ బోర్
బోర్ బోర్ బోర్
పోనీ ఒక ట్రయిల్ వేస్తే పోలేదా ..
కొలంబస్ కోరుకుంటేనే అమెరికా తగిలిందా
నీ ఫోను నెంబరు నొక్కింది ఒక్క వేలే
పెన్నుతో ఎన్నో పరీక్షలు జయించిన ఈ నా గొప్ప చూపుడు వేలు
అందులోని ఆలోచనలు మాత్రం అమావాస్య రాత్రి చుక్కలన్ని
హలో అనాలో హాయ్ అనాలో ఏం అంటావో వినాలో
టెన్షన్ టెన్షన్ టెన్షన్ బాబోయ్ టెన్షన్
ఎంతయినా అమ్మాయి... వే.. కదా
కదా !
కదా!
అవును.. . లే
నిజం మనిషీ ఫోటోలో మనిషీ ఎప్పుడూ వేరువేరే
ఫోనులోని గొంతూ అంతే... నచ్చేట్లే వినిపిస్తుంది
"బిజీగా ఉన్నాను తర్వాత చేస్తాను "
"ఏమనుకోకండీ "
ఇంకేం అనుకుంటానూ ??
పొగరుబోతుదానా
బావున్నాయ్
గొంతూ , పొగరూ
అయినా... నేను ఎదురుచూట్టమా...
ఇం.పా.జి.బు.ల్.
ఫోటో మళ్ళీ చూస్తే ? ఒక్కసారే
"భోంచేసారా ? "
అమ్మలు మాత్రమే కదా ఇలా అడుగుతారు
బావున్నావ్
ఇంకొక అమ్మా? నో థ్యాంక్స్
బోర్. ఇడ్లీ. అమ్మ. బోర్. రొటీన్
ముఫ్ఫైమూడునిముషాలా ముఫ్ఫై సెకెండ్లే కదా చూసాను
" నేను బిజీ , మళ్ళీ చేస్తాను "
పగ తీర్చుకున్నా
శభాష్‌రా మగాళ్ళ పరువు నిలబెట్టావ్
గుండెలో బీరుకొడుతూ బ్రహచారుల మఠం విజిల్స్
"సరే మీరే చెయ్యండి "
అహం కట్ అయ్యి కోపం చిట్లిన చప్పుడు
నేను చెయ్యను
చూద్దాం , చూసుకుందాం
ఎవరికి ఎవరు ముఖ్యమో
పొగరును జిగురులా దాచుకున్న లావా నేను
( పార్ట్ 2 follows )
Subscribe to:
Post Comments (Atom)
5 comments:
chala bagunnayandi mee posts.., telugu people.com lo vilove meerey kadaaa....?????
thank u chandrakala garu
yes....nEnanTE nEnE :)
"కోపం చిట్లిన చప్పుడు"
మీవి కొన్ని కొన్ని పదబంధాలు అద్భుతంగా ఉన్నయ్యి
మెచ్చుకున్నందుకు ధన్యవాదాలు కొత్తపాళీగారు..నచ్చనప్పుడు అంతే ఫ్రాంక్‌గా చెప్పండి :)
WOWWWWWWWWWWWWWWW!
Just too good!
Post a Comment