ఆత్మహత్య మహా పాతకం , ఘోరం , దైవద్రోహం...ఎక్సెట్రా ఎక్సెట్రా అని ఎన్నో మతాలు చెబుతుంటాయని విన్నాం
అలాగే చచ్చి , ఏం సాధిస్తాదు ? బ్రతుకు గొప్పదనం , జీవించడంలోని ఔన్నత్యం, ఉదాత్తం గురించి చాలా కథలూ, మాటలూ, సినిమా డైలాగులూ విని ఉంటాం
కానీ, నిజానికి ఆత్మహత్య అంత తప్పుడు విషయమా?
నాకైతే అలా అనిపించడం లేదు
మొన్నీ , ఒక న్యూస్‍పేపర్లో గత ఏడాదీ , ఈ ఏడదీ జరిగిన ఆత్మహత్యల గణాంకాలు చూస్తే, మనసు చివుక్కుమంది. అరే ఇంతమంది అనవసరంగా ప్రాణాలు తీసేసుకుని విలువైన జీవితాన్ని పోగొట్టుకున్నారే అని.
కానీ కాసేపు ఆలోచిస్తే ,వాళ్ళగురించి అలా judgement ఇవ్వడానిక నాకేం హక్కు ఉంది ?
ఇంకొకడి జీవితం వాడి ఇష్టం. వాడికి బ్రతకాల అనిపించలేదు , చచ్చాడు, he did what he wanted. అది గొప్ప విషయమే కదా .
చెయ్యాలనుకున్నది చేసేసెయ్ , ఎవరేమనుకున్నా అని అన్ని విషయాల్లోనూ positive approachను ప్రోత్సహించే ప్రపంచం మనిషికి తన జీవితాన్ని తన ఇష్టం వచ్చినట్లు బ్రతికే అవకాశం ఉండాలి అన్నట్లే చంపుకునే "హక్కు" కూడా ఉందని మరచపోతుందే ?
కాళ్ళుచేతులూ చచ్చుబడి, లేదా బ్రైన్ డెత్ కేసుల్లా మిగిలిపోయిన మనుష్యులకు mercy killing (euthanasia) హక్కును ఇవ్వాలని ఎన్నో దేశాల్ల ఉద్యమం జరుగుతోంది. కొన్ని దేశాలు మంజూరు చేసాయి . మన దేశంలో ఇంకా ఆ ఉద్యమం నడుస్తూనే ఉంది.అరుణా షాన్బాగ్ కోసం ముఫ్ఫైఏళ్ళనుంచి ఈ పోరాటం సాగుతూనే ఉంది.
కానీ ఆత్మహత్యను మాత్రం ఇంకా నేరంగానే పరిగణిస్తుంది చట్టం. చట్టం ఎక్కడైనా పోనివ్వండి , అదెలాగూ నామమాత్రమే కదా మన దేశంలో . కానీ మనం కూడా అలా నేరంగానే చూస్తామే?!
ఒక మనిషి ఆత్మహత్య చేసుకోవాలి అనుకుంటే దాని వెనుక ఎంతో బలమైన కారణం , జీవితం మీద విరక్తి , మరణంపై ప్రేమ.. ఏదో ఉండాలి కదా ( సరే క్షణికావేశంలో పిచ్చిపనిలా ఆత్మహత్య చేసుకోవడం అనేది వేరు..అది momentary hysteria ).అలా ఒక వివేకవంతుడైన మనిషి ఎంతో నెమ్మదిగా , కూలంకషంగా ఆలోచించి తన జీవితాన్ని తానే అంతం చేసుకో నిర్ణయించుకుంటే... అది తప్పు అనే హక్కు ప్రపంచంగా మనకు ఉందా ?
నాకైతే లేదు అనిపిస్తోంది మరి.
suicide should be made a fundamental right.
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
Even I feel the same. If a person wants to end his life means he sees no future. Even if he lives the life is not going to be the same how he wanted.So he feels like ending his life. God has given this option to human kind means this is not wrong.
మీరు అన్నట్లు ప్రత్యేక సమయాలలో సంధర్భాలలో ఐతే చెప్పటానికొక రీజన్ కనపడుతుందేమో కాని మీరన్నట్లు ఆత్మహత్య మనిషి ప్రాధమిక హక్కు చేస్తే సమాజ పరం గా చాలా సమస్య లు ఎదురవు తాయి. ఆ తరువాత హత్య కూడా ప్రాధమిక హక్కు అవుతుంది. అందుకే కొన్ని దేశాలు లాగా విల్ లో చెప్పుకోవాలి అలాంటీ పరిస్తితులు ఎదురైతే ( శరీరం చచ్చు పడీ పోవటం, బుర్ర పూర్తి గా సేబటైజ్ ఐపోవటం వంటివి) నా నిర్ణయం ఇది అని. అంతే కాని అసలు ఆత్మహత్యే ప్రాధమిక హక్కు ఐతే సమస్యలు చాలా వస్తాయి. భౄణ హత్య లీగలైజ్ చెయ్యటం వలన వుపయోగాలతో పాటు ఎన్నో దుర్వినియోగాలు జరుగుతున్నాయి కదా, అందుకేగా క్లోనింగ్ పట్ల అంత తీవ్ర వ్యతిరేకత అన్ని దేశాలలో...
Post a Comment