సరే ఆత్మహత్య గురించి ఓ తెగ వ్రాసేసాను కదా , అప్పుడే గుర్తుకువచ్చింది నేను చూసిన ఒక అద్భుతమైన సినిమా.
ఇది సినిమా కాదు,, నిజజీవిత గాథ.
elle fashion magazine journalist అయిన అతను , స్ట్రోక్‌కు గురై , శరీరం అంతా చచ్చుబడి locked-in syndrome అనే అవస్థలో ఉండిపోతాడు. అతను తన శరీరంలో కదల్చగలిగినది, ఎడమకంటి రెప్ప మాత్రమే!
అలాంటి వ్యక్తి జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో ఊహించుకోవడానికి భయం వేస్తుంది. ఆ భయాన్ని అతని కంటినుంచే చూపించే అద్భుతమైనpoint of view shotsతో మొదలవుతుంది ఈ సినిమా :the diving bell and the butterfly.
అతను తను ప్రపంచానికి , తనవాళ్ళకు చెప్పాలి అనుకున్న కొన్ని విషయాలను చెప్పడానికి , ఒక పద్ధతిని ఆశ్రయిస్తాడు. ఒక నర్సు , అతని ఎదురుగా, alphabets అన్నిటినీ పలుకుతుంది. తను చెప్పాలి అనుకున్న పదంలోని అక్షరం రాగానే రెప్ప మూస్తాడు. ఆమె ఆ అక్షరం వ్రాస్తుంది. ఒక మూడు అక్షరాలు వ్రాయగానే , మన సెల్‍ఫోన్‍లో డిక్షనరీలా , ఆ అక్షరాల కాంబినేషన్‍లో వచ్చే పదాలను ఊహించి అడుగుతుంది. సరి అయినది రాగానే అతను రెప్ప మూసి అవునంటాడు. రెండు నిముషాలకో పదం చొప్పున్న రెండు లక్షల రెప్పమూతలతో ఆ పుస్తకం రాయించాడు అతను.
ఇదంతా నిజజీవితపు కథ అయితే, ఆ మనిషి ధైర్యానికి , ఆ జీవితపు బలానికి ఒళ్ళు జలదరించడం అటుంచితే ,ఆ సినిమాలో ఒక సీను ఉంటుంది. ( ఇక్కడ ఈ సన్నివేశం మొదలు మాత్రమే ఉంది మూడు నిముషాల దగ్గర..పూర్తి సన్నివేశం చూడాలంటే సినిమా డౌన్లోడ్ చేసుకోవలసిందే)
మొట్టమొదటిసారి అతనికి అలా రెప్పతో communicateచేయడం నేర్పిస్తున్న నర్సు, ఏం రాయమంటావు అని అడితే. అతను ఒక్కో అక్షరమే..
I
w
a
n
t
d
e
a
t
అనగానే..ఆమెకు అర్థమవుతుంది
you want to die?
అని..ఆమె కళ్ళల్లో కోపం
పట్టలేనంత కోపం.
"ఎంత పొగరు నీకు? ఎంత కఠినాత్ముడవు నీవు? నీకోసం ఇక్కడ ఇంతమంది వైద్యులు నిన్నెలా బాగుచెయ్యాలా అని అహర్నిశలూ తపనపడుతున్నారు...నేనొకదాన్ని ఇంటికివెళ్ళినా నీ గురించే ఆలోచిస్తుంటాను , నువ్వు ఎలా ఉన్నావో ఏం చేస్తుంటావో అనే ధ్యాసలో ఉంటున్నాను , నీ కోసం ఇన్ని హృదయాలు వెర్రిగా ఆశిస్తుండగా " చచ్చిపోతాను" అంటావా?? ఎంత తలపొగరునీకు ? ఛావు పో, మళ్ళీ నీ మొహం చూడను"
అంటూ ఏడుస్తూ తిడుత వెళ్ళిపోతుంది.
వెనక్కు పిలిచి సారీ చెప్పాలన్నా గొంతు పెగలని అతను, కన్నటి పొరను తుడుచుోలేని అతను రెప్ప కొట్టుకుంటూ చూస్తుండిపోతాడు.
చావు బ్రతుకులగురించి నేను చూసిన /అనుభవించిన అత్యద్భుతమైన shot అది.
ఆ సినిమాలో వాడుకున్న ఒక పాట..సందర్భోచితమైన సాహిత్యం
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment