ఒక posh restaurantలో పార్టీ తర్వాత మిగిలిపోయిన అత్యంత రుచికరమైన , ఖరీదైన శాఖాహార,మాంసాహార, తీపి వస్తువులన్నిటినీ పార్సిల్ చేయించి , రెస్టారెంట్ బయటే పేవ్మెంటు మీద చెత్తతో నింపిన టార్పాలిన్ సంచులను ఆన్చి , వాటికి జారిగిలబడి , బీడీ త్రాగుతున్న , తైలసంస్కారమూ,క్షవరమూ , శుచీ శుభ్రతలను వెలివేసినట్లున్న బక్కటి మనిషికి ఆ ప్యాకెట్ ఇస్తే ..
" వొద్దు..నా భోజనం అయిపోయింది " అని సమాధానం.
" తీస్కోవయ్యా.. పొద్దున్నకూడా తినొచ్చు " వెనకనుండి పార్టీలో తిన్నదాన్ని పళ్ళ సందుల్లోంచి శుభ్రపరుచుకుంటూ స్నేహితుల ఉచిత సలహా.
" లేదన్నా. ఈ పూటకు తినేసా " అదే సమాధానం . ఆ కళ్ళల్లో తృప్తి. తృప్తిలోంచి పుట్టిన ఆత్మవిశ్వాసం. రేపైనా తిండి సంపాదించుకోగలననేమో!
ఆ మనిషి అలా బీడీ తాగుతూ , sodium vapour lamps నీడల్లో పడుకుని , దారినపోయే కుక్కలనే టీవీ ప్రోగ్రాములా చూసి అరమూడ్పు కన్నులతో సుఖాన్ని తెలియబరుస్తుంటే .. వేల వేల తాత్విక ప్రశ్నలు పుడుతున్నాయి. మనిషికెంత కావాలి ? సుఖమేమిటి ? మనిషి బ్రతుకు ఇంత సింపులా ?! అతని వల్ల ఎవ్వరికేం ఉపయోగం?! ఏమో ఉందేమో! existenceకు మించి మనిషి సాధించేదేముంది ? అతని అస్థిత్వమే అతనివల్ల ప్రపంచానికి ఉపయోగం. existence is what he does !
-౦--౦౦-౦-౦-౦-౦-
ఏవో కారణాల వల్ల, అంతగా రుచించిన సాధారణ భోజనాన్ని , ప్యాక్ చేసి , ఇస్త్రీ పెట్టె , ఒక తోపుడు బండి, తన చేతులో ఆస్తులుగా బ్రతికేస్తున్న చాకలిమనిషికి ఇస్తే... "అయ్యో భోజనమా సార్ " అంటూ , పక్కనే ఆడుకుంటున్న తన పిల్లలను పిలిచి తినడానికి ఉపక్రమిస్తూ , "ఇంతకుముందే మా భోజనం తినేసాం సార్ , కానీ ఇలాంటి తిండి ఎప్పుడో కానీ దొరకదు కదా " అంటూ మారు తినబోతున్నానని చెబితే...
ఛ... ఈ మాత్రం భోజనం ఇతనికీ , ఇతని పిల్లలకూ ఎప్పుడూ కొనేంత తాహతు లేదా ? అతనికి ఇది కూడ దొరకకపోవడం ఎంత అన్యాయం ?! ఆ పిల్లలు పాపం పెద్దయితే ఏమయిపోతారో. వాడెప్పుడైనా ఒక dessert / pizza రుచి చూడగలడా ? ఆ షాపులు రోడ్డు మీదే ఉన్నా. అయినా ఈ వేళ ఇది రుచి చూపించాను, మరి మళ్ళీ రేపు నేను కనిపిస్తే ఆశగా చూస్తే , ఏమివ్వగలను ? ఎందరికివ్వగలను ? ఇవ్వడం , దానం చెయ్యడం నా అహంకారాన్ని పెంచవా ? గుండెల్లో క్యాపిటలిజం , కమ్యూనిజం , ఎక్సిస్టెన్షియలిజం ..ఎన్నీ "ఇజాల" సంఘర్షణ.
ఒకరి తిరస్కారంలో తృప్తి , ఇంకొకరి స్వీకారంలో వేదన.
మనుష్యులు ఊరుకోరు.. ఏవో ప్రశ్నలు రేకెత్తిస్తూనే ఉంటారు .
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
viplove గారూ...,గణేష్ భక్తి గీతాల పారాయణం చేద్దాం
హారం
??
Post a Comment