పి.సైకాలజీ : సరదా కోసం విడదీసుకున్న p-sychology. కాబట్టి దీని ఉద్దేశ్యమూ సరదా అని గ్రహించ మనవి.
( ఆర్కుట్ , ఫేస్‍బుక్ , బ్లాగులు , గ్రాఫిటీ...ఎక్కడైనా కానీ ఒక రకం మనుష్యులు నిరంతరం కనిపిస్తుంటారు.
తమ పేరు / ఐడీల పక్కన కొన్ని అద్భుతమైన ఫోటోలు పెట్టుకునేవారు. నాకెప్పుడూ అలాంటి ప్రొఫైల్స్ first impresionలోనే ఏదో తేడాగా అనిపించేవి. వీళ్ళు అసలు పెట్టుకుంటే తమ ఫోటో పెట్టుకోవచ్చు , లేకపోతే ఏ ఫోటో లేకుండా ఉండొచ్చు కదా వేరే ఫోటోలు ఎందుకు పెడతారు అనుకుని చిరాకు పడేవాడిని.
తమ ఫోటో పెట్టుకోవడం లేదు అంటే రెండు కారణాలు :
1. తమ ఫోటోనూ , పేరునూ ఎవ్వరితోనూ షేర్ చేసుకోవడం ఇష్టం లేదు అని. సరే , అంటే అసలు ఆ మనిషి ఈ ఇంటర్నెట్ పరిచయం / స్నేహం గురించి అసలు నమ్మకం లేదు.. కేవలం time pass చేయడమే ఉద్దేశ్యం అని అర్థం అవుతుంది. అది దృష్టిలో పెట్టుకుంటే మనమూ టైంపాస్ చేయొచ్చు
2. తమ ముఖం చాలా చెత్తగానో , దరిద్రంగానో ఉంటుందనీ తమకే ఒక అభద్రతా భావం ఉండటం. ఆ మొహం చూస్తే తనతో ఎవ్వరూ స్నేహం చేయరు అనే దిగులు / భయం ఉండటం.
నేను రెండు రకాల భావాలున్నవారినీ సమానంగానే చూస్తున్నాను.
మొదటి రకంతో పెద్ద డేంజర్ లేదు కానీ , రెండో రకం వారితోనే కొన్ని ప్రమాదాలు.
తమ ముఖం బావోలేదు అనుకునేవాళ్ళు , దాన్ని accept చేసే రకాలు ఉంటారు , depressedగా ఉండేవాళ్ళూ ఉంటారు.
వీళ్ళ గురించి చెప్పబోయే ముందు, ఈ కోవలోనే కనిపిస్తూనే ఏ కోవకు చెందని వారు ..అంటే EXEMPTIONSను చెప్పుకోవాలి కదా. వీళ్ళకు తమ ముఖం గురించి కానీ , appearance గురించి కానీ ఏ పట్టింపూ ఉండదు. నిజజీవితంలో కూడా చూస్తామే, నలిగిన బట్టలు ,చెదిరిన జుత్తు ఏమీ లెక్క చెయ్యకుండా హుషారుగా తిరిగేసే happy-go-lucky రకాలు. అందుకే తమకు నచ్చిన ఏ చింపాజీ , గ్రహాంతరవాసి , హీరోయిన్ , తమాషా వస్తువు, కార్టూన్, ష్హిరిడీ సాయిబాబా ..ఏదో ఒకటి పెట్టుకుని , తమ మూడ్‍ను అనుసరించి ఆ బొమ్మలు మారుస్తుంటారు. పైన చెప్పిన 2వ రకానికీ వీరికీ తేడా ఏమిటంటే : వీరు కార్టూన్ నుంచి సైన్సు నుంచి గణిత శాస్త్రఙ్ఞులు లేక దేశ నాయకులు లేక వ్యాంపులు..ఇలా ఒకదానికొకటి సంబంధం లేని రకం ఫోటోలు పెట్టుకుంటే , అభద్రతా భావం ఉన్నవారు మాత్రం ఎప్పుడూ ఒకే styleను అనుసరిస్తారు. అంటే ఎప్పుడూ hallmark / annegeddes లాంటి సైట్ల నుంచి వచ్చే గ్రీటింగు కార్డు బొమ్మలాంటి cute / romance అనిపించే బొమ్మలే పెట్టుకునే రకం. అంటే తాము cute / romantic అనీ , కానీ ఆ విషయం తమ ముఖారవిందాల్లో గోచరించదనీ సదా బాధలో ఉంటారని పి.సైకాలజీ. అల్లు అర్జున్, హృతిక్ రోషన్ , ఆర్నాల్డ్...ఇలా అందరూ కండలవీరుల ఫోటోలు , తప్పితే జేమ్స్ బాండ్ , గాడ్ ఫాదర్..ఇలా "మగాడు" అనిపించుకునే ఫోటోలు పెట్టుకునే మగవాళ్ళలో ఏం insecurity ఉంటుందే ఇక వివరించక్కర్లేదు కదా. ఇక రవివర్మ లేక బాపు చిత్రణలో ఉండే ప్రౌఢల బొమ్మలు పెట్టుకునేవారికీ తమ సొంత feminity మీద అనుమానమేమో అనిపిస్తుంది. ఇంకా ఉదాహరణలు అనవసరం , ఎవరికి వారు అర్థం చేసుకోవచ్చు.
ఏతావాతా నే చెప్పొచ్చేదేమంటే...పాపం , ఆత్మవిశ్వాసం లేనివాళ్ళు తమ ముఖాలపైన ఆ విషయం పచ్చప్పొడుచుకున్నట్లు , ఇలా బహిరంగంగా తమ low esteemను ఎందుకు తెలియజేసుకుంటారా అని!!! గొప్ప తెలివిగలవాళ్ళు కూడా under-confidenceతో నలిగిపోవడం ఎప్పటికి ఆగుతుందో మరి.
గమనిక : ఏమైనా చెబితే " మరి నీ సంగతేమిటి? " అని చెప్పినవాడి పీక పట్టుకునే కాలాల్లో ఉన్నాం మనం. నేను ఒక్కోచోట ఒక్కోరకంగా ఉంటాను. కానీ ఏ బొమ్మ వాడినా , అది ఖచ్చితంగా "ఇది నేను" అని తెలిపేట్లే ఉంటుంది. ఉదాహరణకు నా గ్రాఫిటీ : ఒక పందిపిల్ల షేపులో ఉంటుంది. పరీక్షగా చూస్తే అర్థం అవుతుంది అది నా ఐడీకు అర్థం అని. ఆ ఐడీ ఒక కంపెనీ పేరులాంటిదని . అంతేకానీ నేను పందికంటే అందంగా ఉంటాననో / ఉండననో కాదు!!!!!
Wednesday, September 08, 2010
Subscribe to:
Post Comments (Atom)
4 comments:
:-) మీ వోన్ అనాలిసిస్ ఆ ఇది? ఏదైనా బేస్ వుందా?
సైకాలజీ అక్కడక్కడా చదివే నేనూ , సైకియాట్రీ చదివే ఒకరూ , ఎన్నో పుస్తకాలు నమిలి మింగేసే ఇంకొకరూ కూర్చొని మాట్లాడుకుంటుంటే వచ్చిన మాటల సినాప్సిస్ ఇది. వాళ్ళు చాలా రెఫరెన్సులూ పేర్లూ చెప్పారు.అవన్నీ చదవితే తెల్లారిపోతుందని చదవలేదు.
Well.. how about people who are reluctant to be photographed, irrespective of how they look? Don't tell me.. all beautiful people would be dying to get photographed?
And also, why didn't you consider inherent fears of photos having the potential to harm people?
@purnima
as i said..thats just a funny analytical feeling i got..
Not too scientific to dwelve in to...
what you raised , cant be denied
Post a Comment