కిటికీలోంచి వానను చూస్తున్నాడు అతను. జల్లు దెబ్బలకు మట్టి వాసనతో వెర్రెత్తిస్తుంటూ అరచేతులు వెచ్చబరచుకున్నాడు. ఈ వర్షంలో ఒక అందమైన అమ్మాయి డ్యాన్సు చేస్తూ కనిపించదెందుకో , సినిమాల్లో చూపించినట్లు , అనుకున్నాడు అతను. స్త్రీ ఊహ పుట్టగానే ఆమె గుర్తుకు వచ్చింది. సెల్‍ఫొన్ అందుకుని ఆమెకు డయల్ చేసాడు.
" మీ దగ్గర కూడా వర్షమా ? " ఫోన్‍లో ఆమె మాటే కాల్చిన మొక్కజొన్నలా రుచించింది అతనికి.
"శబ్దం వినబడట్లేదా ? " చెవికి చినుకులు తగులుతుంటే కిటికీకి దూరం జరిగాడు అతను.
"ఊ...ఫన్నీ.. ఇక్కడ మా దగ్గర వర్షం సౌండు, ఫోనులో మీ వర్షం సౌండూ..డీటీఎస్ ఎఫెక్ట్‌లా ఉంది " నవ్వింది
" నీ మొహం ..నీ వర్షం నా వర్షం ఏంటీ ? అంతా ఒకటే కదా "
"లేదు మీ ఊరి మబ్బులు వేరు కదా"
"సరే ఆర్గ్యుమెంటెందుకు కానీ..ఏం చేస్తున్నావ్ ?"
" ఏంలే! చూస్తున్నాను. వర్షాన్ని "
ఆమే , తనూ కలిసి తడిస్తే బావుంటుంది కదా అని ఊహించాడు అతను. మబ్బులకున్నంత దూరం వారివురి మధ్య.
" ఓయ్.. నాకో చిన్న విష్ " గుసగుసగా అడిగింది ఆమె.
" ఆఙ్ఞాపించండి మహరాణీ " అల్లరి చేసాడు అతను.
" రేపూ ఎల్లుండీ కూడా ఇలానే వానలు పడ్తాయట"
"అవును..న్యూస్‍లో విన్నా"
" ఇక్కడకు రాకూడదూ ? "
"వస్తే...?" ఆమె గొంతులో శృంగారం హోరుమని కురుస్తుండటం అతను కనిపెట్టేసాడు.
" నాకు..నాకూ.. "
"నాకకుండా చెప్పు "
నవ్వుతో కొట్టింది ఆమె. " నాకు సిగిరెట్ త్రాగాలని ఉంది "
"వ్వాట్ ? " అతనికే ఆ అలవాటు లేదు. వాళ్ళ మధ్య ఎప్పుడూ ఆ ప్రసక్తే రాలేదు.
" ఏమో..ఎప్పుడూ సినిమాల్లో చూట్టమో , రోడ్ మీద మగాళ్ళను చూడటమే కానీ ఎప్పుడూ ఎక్స్‌పీరియెన్స్ చెయ్యలేదు కదా. ఒకసారి ట్రై చేద్దాం అని ఉంది. ఈ వర్షంలో అలా పొగ ఊదితే ఎలా ఉంటుందో.." మాటలను ఊహల్లోకి వదిలేసింది ఆమె.
" హ్మూ..బానే ఉంది. ఎవరైనా బ్యాడ్ హాబిట్స్ మానెయ్యమంటారు. నువ్వేంటీ ఎంకరేజ్ చెయ్యమంటావ్ ?" అతనికి చిత్రంగా ఉంది.
"నీకేం బాబూ అబ్బాయివి. ఎక్కడైనా ఎప్పుడైనా కొనుక్కోగలవ్. నేనసలు ఎక్కడ కొనగలను ? కొన్నా నీలాగా ఫ్రీగా రోడ్ మీద వెలిగించలేను కదా.. ఆమె ఏమిటేమిటో చెప్పుకుపోతోంది.
ఆమె అమ్మాయి అయినందుకు "పాపం" అనిపించింది అతనికి. మొట్టమొదటిసారిగా !
Tuesday, September 07, 2010
Subscribe to:
Post Comments (Atom)

8 comments:
brilliant
ఇండియా లో అమ్మాయిలు ఇంకా సిగెరెట్ తాగటం లేదా ఐతే.? వూరికే నవ్వుతూ అన్నాలెండి, తాగరు లే. పర్లేదు లే జాలిపడక్కరలేదు ఆ బేడ్ హేబిట్ కనీసం జనాలకు భయపడి ఐనా చేసుకోవటం లేదు...
చివరి లైన్లు నేను స్పష్టంగా వ్రాయలేదా ?! :(
ఇండియాలో అమ్మాయిలు సిగిరెట్లు త్రాగట్లేదు అని కాదు, అందరూ అనుకున్నప్పుడు అనుకున్నవెంటనే కొనలేకున్నారు , కొన్నా పబ్లిక్‍లో త్రాగలేకున్నారు అని.
బేడో గుడ్డో...జనాలకు "భయపడి" బ్రతకవలసి వస్తోంది కదా. అది విచారకరం కాదా??!!
సిగిరెట్ త్రాగినంత మాత్రాన అమ్మాయి "బ్యాడ్" అయిపోతుందని ఇంకా నమ్మేవాళ్ళుండటం వింతే!
సిగెరెట్ తాగితే అమ్మాయి చెడ్డవుతుంది అని కాదువిప్లవ్ నా మాట. సిగెరెట్ తాగటం ఆరోగ్యానికి హానికరమైన అలవాటు అది ఎవరు చేసినా నష్టమే.అమ్మాయిలు కనీసం జనాల కు యపడి కొనుక్కోవటం లేదు కదా అలా ఐనా వాళ్ళ ఆరోగ్యం రక్షింప బడుతుంది అని జోక్ చేసా,సెకండ్ హేండ్ స్మోక్ వలన అని అడిగితే అది వేరే కధ అనుకో. అంతే కాని అమ్మాయిల స్వాతంత్రం గురించి అనలేదు నేను. :-)
ఇదే సీను మీరు మానస-సంచరరే లో కూడా రాసినట్టున్నారు :)
అయితే మీరు సినిమా తీస్తే మాంచి లవ్‍స్టోరీ ఎక్స్‍పెక్ట్ చెయ్యొచ్చన్నమాట :)
@RG
ఇప్పుడు మీరు చెప్పేవరకూ గుర్తుకురాలేదండీ!
అక్కడ వర్షం కాదు...హిమాలయాలో ఏవో మంచు ప్రదేశాల్లోకి వెళ్ళినప్పుడు సీను కదా !
ఏమైనా వ్రాసిందే వ్రాయడం క్షమార్హం కాదు ! కాకపోతే , ఇదే "కోరిక" ఉన్నవాళ్ళు , తీర్చుకోనివాళ్ళు అప్పట్నించీ ఇప్పటిదాకా తారసపడుతూనే ఉన్నారు మరి :(
just checked ur blog...so much of Woody Allen! I wish I can make all genres like he does ...a bit eccentric even if they are
Did you see "Crimes and Misdemeanors " ?
that one sensitive portrayal of Allen I ever saw! dont miss, if u did not watch it yet
When I read this post in someone's buzz.. it was a thorough disappointment! In fact, it did raise my blood pressure a bit.. but then, I was too busy for an argument.
>> చివరి లైన్లు నేను స్పష్టంగా వ్రాయలేదా ?! :(
According to me, NO! The line.. "ఆమె అమ్మాయి అయినందుకు "పాపం" అనిపించింది అతనికి. మొట్టమొదటిసారిగా !" was huge turn off for me.
"జనాలకు "భయపడి" బ్రతకవలసి వస్తోంది కదా. అది విచారకరం కాదా??!!" Agreed. But that doesn't call for pity! Please.. :) Empathy should have been great, instead of sympathy!
"అవును.. అబ్బాయిలం మేం! మేమేం చేసినా చెల్లిపోతుందనుకుంటారు మీరు. Quintessential Indian Values వల్ల ఎన్ని కోరికలను చంపుకుంటూ చస్తూ బతుకుతున్నామో మీకేం తెలుస్తుంది?" అననుకొని,పైకి మాత్రం అట్టహాసంగా నవ్వటం అనేది నాకు నచ్చే ముగింపు.అలా కాక, ఆమెను తీసుకుపోయి సిగెరెట్ వెలిగించివ్వటమో, అదీ కాకపోతే.. "అమ్మాయివి అయ్యుండి సిగరెట్టా.. ఛీ! ఛీ!" అనే hypocritical behaviour అయినా బాగుండేది.. "పాపం!" తప్పించి.
Well, may be you are right in your place. You wrote what you wanted to. But this reader of yours didn't find what she wanted to read. One thing, you gotta note is this reader isn't worried about the "taboo" the post deals with. It's beyond that.
Apologies if I've cracked your ego. Absolutely okay, if you don't approve this comment.
@purnima
"Empathy should have been great, instead of sympathy! "
My empathy got mixed with sympathy.
అలా కాక, ఆమెను తీసుకుపోయి సిగెరెట్ వెలిగించివ్వటమో, అదీ కాకపోతే.. "అమ్మాయివి అయ్యుండి సిగరెట్టా.. ఛీ! ఛీ!" అనే hypocritical behaviour అయినా బాగుండేది.. "పాపం!" తప్పించి.
If you note, the distance was too far to run immediately to light a cigarette
and second , the whole point is that women should not be needing some tom to fetch a cigarette, but be in a position to buy themselves whenever they want.
"you wrote what you wanted to. But this reader of yours didn't find what she wanted to read"
That what this is all about , writing what I want , not minding about who reads and if they like or accept or hate it .
thanks for detailed comment.loved them
Post a Comment