పేరు గుర్తులేదు కానీ , మూడునాలుగురోజులనుండీ వార్తల్లో నలుగుతున్న విషయం ఇది:
ఒక స్త్రీ (ప్రస్తుతానికి పేరు X అనుకుందాం ) , భర్త తెగతెంపులు చేసుకోవడంతో ఏ దిక్కూతోచక ఉన్నప్పుడు ఒక మగాడి (పేరు Y అనుకుందాం ) ప్రేమను నమ్మి మోసపోయి వ్యభిచార కూపంలోకి నెట్టబడింది. ఎలాగోలా బయటపడి ఇప్పుడు ఆ సంఘం దృష్టిలో దర్జాగా బ్రతుకుతున్న ఆ మగాడి అసలు రూపం బయటపెట్టడానికి , అతనింటికి వెళ్ళి గొడవ పెట్టుకోబోయింది. ఆ ఊరి పోలీసులు అతని పక్షం వహించి " పోయి వ్యభిచారం చేసుకో ఇక్కడేంటి గొడవ" అన్నారు. పోలీసు అనకూడని మాట అన్నాడని ఆమె మానవహక్కుల కమీషన్‍ను ఆశ్రయించింది. ఆ ఆశ్రయించడంలో మామూలుగా ఫిర్యాదులా కాకుండా , నాకు న్యాయమైనా చేయండి లేక ఆ పోలీసు చెప్పినట్లు వ్యభిచారం చేసుకోవడానికి లైసెన్స్ అయినా ఇప్పించండి అని అడిగింది. ఇంకేముందీ, వార్త సంచలనం. పవిత్ర భారతదేశంలో ఒక స్త్రీ తను వ్యభిచారం చేసుకుంటానని పబ్లిక్‍గా చెప్పడమే ! సెన్సేషన్ చేసేందుకు రెడీగా ఉండే ఛానెళ్ళన్నీ ఆమె చుట్టూ ఈగల్లా చేరాయి.
ఇంతవరకూ బావుంది. శభాష్. ఆమె ధైర్యాన్ని , పోరాటపటిమను మెచ్చుకోవాలి. మోసానికి గురైన స్త్రీలందరూ ఇంత తెగువ ప్రదర్శిస్తే కానీ కాస్తయినా ఈ (సె)క్స్‌ప్లాయిటేషన్ కేసులు తగ్గవు.
అసలు వేశ్యావృత్తిని చట్టబద్ధం చెయ్యాలా అనే పాత డిస్కషన్‍ను మరోసారి తెరపై తీసుకురాగల్గిన వార్త.
ఇలా ఈ వార్త constructiveగా ఏదో మార్పు తెస్తుందేమో అని ఆశించిన నాకు , ఈవేళ కొనసాగింపుగా ఈ వార్త ఎటువెళ్తోందో చూసాక... చాలా భయమేసింది. ఇది సమాజం కాదు. రౌడీరాజ్యం. ఆటవిక న్యాయం మళ్ళీ వస్తోందా అనిపించింది.
మానవహక్కుల కమిషన్‍కు వివరణ ఇచ్చేందుకు మిస్టర్ X వస్తే , కొందరు మనుష్యులతో అక్కడే కాచుకున్న ఉన్న Y , అతడిని చొక్కా పట్టుకుని చెప్పులతో కొట్టింది. అతను పారిపోకుండా అతని కారు టైర్లలో గాలి తీసేసింది. ఈ సూపర్ యాక్షన్ ఎపిసోడ్‍ను చిత్రీకరించడమే కాక , అక్కడే ఉన్న మీడియా కెమెరామెన్ Y పారిపోజూస్తుంటే అతని చుట్టూ చేరి , ఆమెకు అతను దొరికేట్లు , మరిన్ని చెప్పుదెబ్బలు తినేట్లు చేసారు.
మొట్టమొదటిసారిగా నాకు ఆ మగవాడిని చూస్తే జాలి వేసింది. పాపం అనిపించింది. ఇంతవరకూ మనం ఈ స్త్రీ మాటలే విన్నాం. నిజం ఏమిటో objectiveగా పరిశోధించడమో , విచారణ జరిపించడమో జరగలేదు. అతను నిజంగా తప్పు చేసాడో లేదో ఇంకా తేలనే లేదు. ఒకవేళ తేలినా, చట్టప్రకారం అతనికి శిక్ష ఏదో ఉంటుంది కదా. నడిరోడ్డుమీద చెప్పుతో కొట్టడం ఏ శిక్షాస్మృతి ప్రకారం కరెక్టు ? అదీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ?
ఈ సొసైటీలో చట్టం పన్జెయ్యడం లేదు అని చెప్పడానికి ఆ మహిళను కించపరుస్తూ మాట్లాడిన పోలీసు ఉదాహరణ కన్నా , కోర్టు ఆవరణలో ఒక వ్యక్తిని చుట్టుముట్టి దాడి చేస్తున్నా కలుగజేసుకోని పోలీసులు, ఆ తర్వాత ఇదంతా వీడియో ఫుటేజ్‍లో ఉన్నా ఆ పని చేసినవారిని అరెస్టు చేయని , కేసు పెట్టని చట్టాలు...
utter failure of system.
రేప్పొద్దున్న మనం ఎవరైనా మనకు అనిపించనవాడిని ఇలా చితకబాదొచ్చన్నమాట. వీలైతే ఒక ఆడదాన్ని పక్కన పెట్టుకోవాలి , పోలీసులు , చట్టాలు తప్పించుకోవాలి అంటె. అంతే. శిఖండిని అడ్డం పెట్టుకున్న అర్జునుడిలా.
చట్టం ఏమో కానీ ప్రజలుగా మనం మాత్రం శిఖండులు అవుతున్నాం.
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
మీ నిజం పేరు విప్లవా, లేక కలం పేరా. ఒకవేళ నిజంపేరే ఐతే పేరుకు తగ్గ మనిషే.:)
కలంపేరు ఐతే మనిషికి తగ్గ మనిషి.
Post a Comment